అక్షరటుడే, వెబ్‌డెస్క్: Team India | ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ జోరు కొనసాగుతోంది. వేదిక మారినా, ప్రత్యర్థి ఎవరైనా టీమిండియా ఆట తీరు మాత్రం మారడం లేదు. కొలంబో వేదికగా జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా India national cricket team పూర్తి ఆధిపత్యం చెలాయించి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్Pakistan పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏ నుంచి సూపర్-8 బెర్త్‌ను ఖరారు చేసుకుంది. పాక్‌పై తమ ఆధిపత్యాన్ని 8-1గా మరింత బలోపేతం చేసింది భారత జట్టు.
Team India | ఇషాన్ కిషన్ విధ్వంసం – భారత్ భారీ స్కోర్
మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి 40 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టుకు బలమైన ఆరంభం ఇచ్చాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 32 పరుగులతో చక్కటి భాగస్వామ్యం అందించగా, శివమ్ దూబే Dube 27 పరుగులతో చివర్లో వేగం పెంచాడు. పాకిస్థాన్ బౌలర్లలో సైమ్ అయూబ్ మూడు వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేయడానికి ప్రయత్నించగా, ఉస్మాన్ తారిక్ ఒక వికెట్ సాధించాడు. అయినప్పటికీ చివరి ఓవర్లలో భారత బ్యాటర్లు వేగం పెంచడంతో స్కోరు 170 దాటింది.
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ Pakistan తొలి ఓవర్ నుంచే కుదేలైంది. హార్దిక్ పాండ్యా మెయిడిన్ వికెట్ తీసి ఓపెనర్‌ను ఔట్ చేయగా, తర్వాతి ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా వరుసగా రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాడు. పవర్‌ప్లే ముగిసే సరికి పాక్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. బాబర్ ఆజామ్ తక్కువ స్కోరుకే అవుట్ కావడం పాకిస్థాన్‌కు భారీ దెబ్బైంది. మధ్యలో వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ ఒక్కడే ప్రతిఘటించి 44 పరుగులు చేశాడు. షాదాబ్ ఖాన్‌తో కలిసి ఐదో వికెట్‌కు కొంత భాగస్వామ్యం నెలకొల్పినా, అక్షర్ పటేల్ అతన్ని ఔట్ చేయడంతో పాక్ ఆశలు ఆవిరి అయ్యాయి.
అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ స్పిన్ దాడితో పాకిస్థాన్ బ్యాటింగ్‌ను పూర్తిగా కట్టడి చేశారు. వరుణ్ Varun వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి హ్యాట్రిక్ అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. చివర్లో షాహిన్ షా అఫ్రిది కొంత దూకుడు చూపించినా, హార్దిక్ పాండ్యా కీలక వికెట్ తీసి భారత విజయాన్ని ఖాయం చేశాడు. పాకిస్థాన్ 18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది.