అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shubman Gill | టీమిండియా ఆటగాళ్లు గాయాల బారిన పడుతుండడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ఆస్ట్రేలియా టూర్లో (Australia Tour) గాయపడ్డ శ్రేయాస్ అయ్యర్ కొన్ని రోజులు ఐసీయూలో చికిత్స పొంది అనంతరం క్రమంగా కోలుకుంటున్నాడు.
ఇక ఇప్పుడు టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (captain Shubman Gill) ప్రస్తుతం ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం బయటకు రావడంతో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. భారత్-సౌతాఫ్రికా (India-South Africa) టెస్ట్ సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతుండగా.. గిల్ రెండోరోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆడుతున్న సమయంలో మెడ నొప్పితో బాధపడ్డాడు. దాంతో అతను రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు.
Shubman Gill | టెన్షన్, టెన్షన్..
అనంతరం అతడిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. గిల్ మెడకు సర్వైకల్ కాలర్ వేసి స్ట్రెచర్‌లో చికిత్స అందిస్తున్నారు. ఇది సీరియస్ ఇంజ్యురీ అన్నఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. గిల్ బ్యాటింగ్ ప్రారంభంలోనే మూడు బంతులని ఎదుర్కొని నాలుగో బంతికి ఫోర్ కొట్టాడు. ఆ సమయంలో కండరాల నొప్పితో తీవ్రంగా బాధపడ్డాడు. అది చూసి అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
BCCI (భారత క్రికెట్ బోర్డు) (Board of Cricket in India) కూడా ఈ విషయంపై స్పందించింది. నొప్పి తీవ్రత ఉన్నందున గిల్‌ను ఆసుపత్రికి తరలించామని, మెడికల్ టీమ్ అతనిని పర్యవేక్షిస్తుందని ప్రకటించింది. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ మాట్లాడుతూ.. గిల్‌కి నిద్రలేమి కారణంగా మెడ నరాలు పట్టేసి ఉంటాయని, త్వరలోనే పూర్తి రికవరీ సాధిస్తాడు అన్నారు. శుభ్‌మన్ గిల్ కి ఐసీయూలో చికిత్స జరుగుతుందనే వార్తలు విని అభిమానులు మాత్రం ఉలిక్కిపడుతున్నారు. మంచి టాలెంట్ ఉన్న గిల్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.
