అక్షరటుడే, గాంధారి: Intermediate Education | తమకు రెండో వార్షిక వేతన వృద్ధి (సెకండ్ అన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్) ఇవ్వాలని గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాల (Gandhari Government Junior College) అధ్యాపకులు కోరారు.
ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా విధులను నిబద్ధతతో నిర్వర్తిస్తున్నప్పటికీ మాకు రావాల్సిన రెండో వార్షిక వేతన వృద్ధి ఇంకా అమలు కాలేదని వివరించారు. ఇంటర్మీడియేట్ కమిషనర్‌కు (Intermediate Commissioner) తమ తరపున వినతిపత్రం అందించాల్సిగా ప్రిన్సిపాల్‌ను కోరారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గడ్డం గంగారాం మాట్లాడుతూ అధ్యాపకుల అభ్యర్థనను సంబంధిత ఉన్నతాధికారులకు వెంటనే పంపిస్తామన్నారు. సమస్య త్వరితగతిన పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు లెక్చరర్లు పాక రాజగోపాల్, ఎన్.లక్ష్మణ్, జెట్టి విజయకుమార్, కె.రమేశ్, వెంకటస్వామి, సంబాజి, సరిత తదితరులు పాల్గొన్నారు.
