HomeUncategorizedTeachers Protest | వెబ్​ కౌన్సిలింగ్​కు వ్యతిరేకంగా టీచర్ల ధర్నా

Teachers Protest | వెబ్​ కౌన్సిలింగ్​కు వ్యతిరేకంగా టీచర్ల ధర్నా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Teachers Protest | ఆంధ్రప్రదేశ్​(AP)లో ఉపాధ్యాయులు(Teachers) కదం తొక్కారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా డీఈవో(DEO) కార్యాలయాలను ముట్టడించారు. ఉపాధ్యాయ  సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 13 ఉమ్మడి జిల్లాల డీఈవో కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు.

ఏపీ ప్రభుత్వం టీచర్ల బదిలీ (Teachers Transfer)కి చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం వెబ్​ కౌన్సెలింగ్ (Web Councilling)​ ద్వారా ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. టీచర్లు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఎస్జీటీలకు మ్యాన్యూవల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వెబ్ కౌన్సిలింగ్ వద్దు.. మ్యాన్యూవల్ కౌన్సిలింగ్ ముద్దు అంటూ ఆందోళన చేపట్టారు.