Teachers Training
Teachers Training | ఉపాధ్యాయులు బోధనా సామర్థ్యాలను పెంచుకోవాలి

అక్షరటుడే, ఇందూరు: Teachers Training | ఉపాధ్యాయులు బోధనా సామర్థ్యాలను పెంచుకొని విద్యార్థులకు పూర్తిస్థాయిలో అర్థ్యమయ్యేలా పాఠాలు చెప్పాలని డీఈవో అశోక్ అన్నారు. మాణిక్ భండార్ పాఠశాలలో (Manik Bandar School) కొనసాగుతున్న జీవశాస్త్ర ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలన్నారు.

అనంతరం రాష్ట్ర రిసోర్స్ పర్సన్లు (State Resource Persons) శ్రీనాథ్, మాణిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తరగతి గదికి నాయకుడని వివరించారు. సరైన ప్రణాళికను సిద్ధం చేసుకుని విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని తెలిపారు. అలాగే షీటీం (She Team) ఆధ్వర్యంలో ఎస్సై స్రవంతి పోక్సో, ఇతర చట్టాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కోర్స్ ఇన్​ఛార్జి గంగాకిషన్, డీఆర్పీలు సాయిబాబా, మధుసూదన్, రమేష్, ప్రశాంత్, శ్రీధర్, మల్లేష్, మానసిక వైద్యానిపుణులు వివేక్ పాల్గొన్నారు.