అక్షరటుడే, ఆర్మూర్: Teachers Day | మండలంలోని దేగాం ఉన్నత పాఠశాలలో (Degam High School) ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యా కమిటీ (Education Committee) సభ్యులు మాట్లాడుతూ ఉత్తమ సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను గ్రామంలోని విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలన్నారు.
సభకు అధ్యక్షత వహించిన హెచ్ఎం బున్ని రాజేందర్ (HM Bunni Rajender) మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకొని, చక్కగా చదువుకొని, జీవిత లక్ష్యాలను సాధించే దిశలో ముందుకు వెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులకు, గ్రామానికి, దేశానికి మంచి పేరు తేవాలన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరినీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం బున్ని రాజేందర్, విద్యా కమిటీ సభ్యులు సుదర్శన్, రమేశ్, ఉపాధ్యాయులు ఇందుమతి, రాజ్ నారాయణ, శ్రీధర్, సుమతి, నరేందర్, శ్రీనివాస్, నాగమణి విద్యార్థులు పాల్గొన్నారు.