అక్షరటుడే, వెబ్డెస్క్ : Teacher Suspended | ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్లో మెసేజ్లు (WhatsApp Massages) పంపుతున్న ఓ ఉపాధ్యాయుడికి అధికారులు షాక్ ఇచ్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులను రెచ్చగొట్టేలా ప్రేరేపిస్తున్నారని ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
కరీంనగర్ జిల్లా (Karimnagar district) జమ్మికుంట బాలికల ఎంపీపీఎస్ పాఠశాలలో శ్రీనివాస్ ఎస్జీటీగా పని చేస్తున్నాడు. ఆయన విద్యార్థులు, తల్లిదండ్రులను రెచ్చగొట్టే సందేశాలను పోస్ట్ చేస్తున్నారని, మధ్యాహ్న భోజనం (mid-day meal) వంటి ప్రభుత్వ పథకాల గురించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో జమ్మికుంట ఎంఈవో ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.
Teacher Suspended | నిజమని తేలడంతో..
ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పాఠశాల, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని విచారణలో తేలింది. అతను పాఠశాలలో వాయిస్, వీడియోను (voice and video) రికార్డ్ చేసేవాడని ఎంఈవో నివేదికలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయుడిని బెదిరించేవాడని తెలిపారు. CCA నియమాలు 1991, ప్రవర్తన నియమాలు 1964ను ఉల్లంఘించినందుకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు కరీంనగర్ డీఈవో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వాట్సాప్లో ప్రభుత్వ వ్యతిరేక సందేశాలు పంపినందుకు ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
