అక్షరటుడే, ఇందూరు: Teacher suspension | నందిపేట మండలం కుద్వాన్పూర్ (kundwanpur) ప్రభుత్వ పాఠశాలలో శనివారం జరిగిన ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు.
నందిపేట్ (nandipet) ఎంఈవో విచారణ చేపట్టిన అనంతరం నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ (Deo Ashok) సమర్పించారు. రెండో తరగతి విద్యార్థులను చితకబాది.. వారి కళ్లల్లో కారం చల్లినట్లు తేలడంతో ఆదివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయుడు శంకర్ (Teacher Shankar) నందిపేట్ మండలంలోని మాయాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పోస్టింగ్, కానీ కుద్వాన్‌పూర్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు.
Teacher suspension | విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ సైకోలా మారి..
నందిపేట (Nandipet) మండలం కుద్వాన్పూర్ ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు (Govt Teacher) విచక్షణరహితంగా వ్యవహరించారు. చిన్నారులని కూడా చూడకుండా కంట్లో కారం కొట్టి చిత్రహింసలు పెట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పాఠశాలలోని రెండు, మూడో తరగతి చదువుతున్న 10 మంది విద్యార్థులను సదరు ఉపాధ్యాయుడు ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. అల్లరి చేస్తున్నారనే కారణంతో వారిని కొట్టడంతో పాటు కంట్లో కారం పోశాడు. ఇటీవల ఈ ఘటన జరగ్గా మరుసటి రోజు నుంచి ఆయన బడికి రావడం మానేశాడు.
Teacher suspension | తల్లిదండ్రులు రావడంతో..
పిల్లలను కొట్టిన తర్వాత బడికి రావడం మానేసిన ఉపాధ్యాయులు శనివారం తిరిగి హాజరయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని అతడిపై దాడికి యత్నించారు. దీంతో సదరు ఉపాధ్యాయుడు పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎంఈవో పాఠశాలకు చేరుకొని వివరాలు సేకరించారు.
Nandipet | ఎంఈవో విచారణ
ఘటనపై నందిపేట ఎంఈవో గంగాధర్ (MEO Gangadhar) విచారణ చేపట్టారు. ఈ ఘటనపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆయమ్మ నుంచి వివరాలను సేకరించారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు డీఈవోకు అందజేశారు. దీంతో డీఈవో చివరకు ఉపాధ్యాయుడు శంకర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.