అక్షరటుడే, హైదరాబాద్: Teacher rapes student | విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తండ్రి తర్వాత తండ్రిలా కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కామాంధుడిగా మారాడు. ఈ కీచకుడికి కోర్టు కఠిన శిక్షే విధించింది.
విద్యార్థినిపై అత్యాచారం చేసిన ట్యూషన్ టీచర్‌ను రాజేంద్రనగర్ కోర్టు Teacher rapes student కఠినంగా శిక్షించింది. నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ ఇక్కడి ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి పి. ఆంజనేయులు తీర్పునిచ్చారు.
ఏపీపీ దేవులపల్లి ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏడో తరగతి చదివే బాలిక (12)కు వారి అపార్టుమెంటులోనే సుబ్రమణేశ్వర్ రావు ట్యూషన్ చెప్పేవాడు.
Teacher rapes student | గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం
డిసెంబరు 3, 2017న విద్యార్థిని తల్లిదండ్రులు చెన్నై Chennai వెళ్లారు. బాలికకు తోడుగా ఇంట్లో నానమ్మ ఉంది. అమ్మాయి ట్యూషన్‌కు వెళ్లింది. అయితే రాత్రి 9 గంటలకు మిగతా పిల్లలను పంపించిన సుబ్రమణేశ్వర్రావు.. బాలికను మాత్రం ఇంట్లోనే ఆపేశాడు.
ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మరుసటి రోజు బాధితురాలు తన తల్లికి కాల్ చేసి జరిగిన ఘోరాన్ని వివరించింది.
తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చాక.. రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు police కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సాక్ష్యాధారాలను కోర్టుకు నివేదించారు. వాటిని క్షుణ్ణంగా పరివీలించిన న్యాయమూర్తి నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. ఐదు వేల జరిమానా విధించారు.
కామాంధుడి అఘాయిత్యానికి బాలైన బాధిత విద్యార్థినికి రూ.3 లక్షల పరిహారం అందించాలని అధికారులకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.