అక్షరటుడే, మెండోరా: Mendora Mandal | ట్రాక్టర్ ఢీకొని ఓ స్టాఫ్‌నర్స్ దుర్మరణం చెందింది. ఈ ఘటన మెండోరా మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై సుహాసిని (Sub-Inspector Suhasini) వివరాలు వెల్లడించారు.
Mendora Mandal | బైక్‌పై వెళ్తుండగా..
పోచంపాడ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో (Pochampad Telangana Social Welfare Girls School) స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్న ప్రియాంక రోజూలాగే పాఠశాల ముగిసిన అనంతరం తన సోదరుడితో బైక్‌పై తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో పోచంపాడ్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ డ్రైవర్ వేముల మహేష్ వీరి బైక్‌ను ట్రాక్టరతో బలంగా ఢీకొట్టాడు. దీంతో కిందపడిన ప్రియాంకకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు వెంటనే ఆమెను నిర్మల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై సుహాసిని తెలిపారు.