HomeUncategorizedNTR District | మరో మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ

NTR District | మరో మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: NTR District | ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh)​లో మరో మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీడీపీ పాగా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి మున్సిపాలిటీ (Kondapalli Municipality) ఛైర్మన్​, వైస్ ఛైర్మన్ పదవులను తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది.

NTR District | కోర్టు తీర్పులో..

ఆంధ్రప్రదేశ్​లో 2021లో మున్సిపల్​ ఎన్నికలు జరిగాయి. కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉండగా.. టీడీపీ, వైసీపీ చెరో 14 స్థానాల్లో గెలిచాయి. ఒక ఇండిపెండెంట్​ అభ్యర్థి విజయం సాధించారు. స్వతంత్రంగా గెలిచిన శ్రీదేవి టీడీపీకి మద్దతు తెలిపారు. అదే సమయంలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తన ఎక్స్ అఫిషియో ఓటును వైసీపీకి వేయడంతో ఆ పార్టీ బలం కూడా 15కు సమమైంది. ఈ క్రమంలో అప్పటి టీడీపీ ఎంపీ కేశినాని ఎక్స్​ అఫిషీయో(TDP MP Kesinani ex officio) సభ్యుడిగా ఓటు వేశారు. దీంతో టీడీపీ గెలుపొందింది.

కేశినేని నాని(Keshineni Nani) ఓటు చెల్లదని వైసీపీ హైకోర్టు(High Court)ను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కేశినేని నాని ఎక్స్​ అఫిషీయో ఓటు చెల్లుతుందని తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో తీర్పు కాపీని సోమవారం సీల్డ్​ కవర్​లో అధికారులకు అందించారు. దీంతో టీడీపీ మున్సిపల్​ పీఠాన్ని కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌‌గా టీడీపీకి చెందిన చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ ఛైర్​పర్సన్​లుగా చుట్టుకుదురు శ్రీనివాస్(టీడీపీ), శ్రీదేవి(స్వతంత్ర) ఎన్నికయ్యారు.

Must Read
Related News