అక్షరటుడే, వెబ్డెస్క్: TDP Protest | మాజీ మంత్రి, వైసీపీ నాయకులు అంబటి రాంబాబుపై (Ambati Rambabu) టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీతో పాటు తెలంగాణలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.
అంబటి రాంబాబు ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి (AP Chief Minister)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే ఆయన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. అయితే తన వ్యాఖ్యలపై రాంబాబు క్షమాపణలు సైతం చెప్పారు. అయినా టీడీపీ నాయకులు (TDP Leaders) ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
TDP Protest | హైదరాబాద్లో…
హైదరాబాద్ (Hyderabad)లో టీడీపీ నాయకులు అంబటి రాంబాబు దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. పొగాకు జయరాం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి పంజాగుట్ట శ్మశాన వాటిక వరకు దిష్టిబొమ్మ ఊరేగించారు. అనంతరం అంబటి దిష్టిబొమ్మను శ్మశానంలో దహనం చేశారు. ఏపీలో కూటమి నాయకులు అంబటి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. ఏపీలోని పలు ప్రాంతాల్లో సైతం అంబటి దిష్టిబొమ్మతో శవయాత్రలు నిర్వహించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పటికే పోలీసులు రాంబాబును అరెస్ట్ చేశారు. ఆయనను ఆదివారం రాత్రి గుంటూరు కోర్టు (Guntur Court)లో హాజరు పర్చారు. న్యాయమూర్తి అంబటికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను జైలుకు తరలించారు.