ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Nara Lokesh | టీడీపీ జాతీయ అధ్య‌క్షుడి ఎన్నిక‌.. నారా లోకేష్‌కి ఏ ప‌ద‌వి ఇస్తారు..!

    Nara Lokesh | టీడీపీ జాతీయ అధ్య‌క్షుడి ఎన్నిక‌.. నారా లోకేష్‌కి ఏ ప‌ద‌వి ఇస్తారు..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ :Nara Lokesh | కడప వేదికగా తెలుగుదేశం మ‌హానాడు (Mahanadu) అట్ట‌హాసంగా జ‌రుగుతుంది. నేడు రెండో రోజు తెలుగుదేశం మహానాడు ఉదయం 10 గంటలకు ప్రారంభ‌మైంది.

    ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని ఘన నివాళి అర్పించారు. తెలుగుజాతి-విశ్వఖ్యాతి, రాష్ట్రం-విధ్వంసం వైపు నుంచి పున్నర్మాణం వైపు అడుగులు, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ-వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ధ, యోగాంధ్ర ప్రదేశ్, మౌలిక సదుపాయలతో మారునున్న రాష్ట్ర ముఖచిత్రం తదితర తీర్మానాలపై చర్చిస్తారు. శాంతి భద్రతల పరిరక్షణ, పర్యాటక అభివృద్ధికి పటిష్ఠ చర్యలు రాజకీయ తీర్మానం తదితర అంశాలపై చర్చకు ఆమోదం తెలుపుతారు. సాయంత్రం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణ స్వీకారం ఉంటుంది.

    Nara Lokesh | అంద‌రి దృష్టి అటే…

    అయితే టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు (Chandra babu Naidu) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. కడప వేదికగా జరుగుతున్న మహానాడులో అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. టీడీపీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మూడు దశాబ్దాల పాటు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన.. తొలిసారిగా 1995లో టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నాటి నుంచి ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతోన్నారు. మ‌రోవైపు పార్టీ పగ్గాలను యువనేత నారా లోకేష్‌(Nara Lokesh)కి అప్పగించాలనే వాయిస్ పార్టీలో వినిపిస్తుంటే.. అధినేత చంద్రబాబు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారు.

    ఒకప్పుడు పప్పు అని ప్రతిపక్షం విమర్శలు ఎదుర్కొన్న నారా లోకేష్.. ఇప్పుడు నిప్పులా మారారు. ఎక్కడ ఓడిపోయారో అదే మంగళగిరి నియోజకవర్గం (Mangalagiri Constituency) నుంచి భారీ మెజార్టీతో గెలవడం ద్వారా ఆయన.. ప్రజాభిమానం భారీగా ఉన్న నేతగా మారారు. మంత్రిగానూ తనదైన ముద్ర వేస్తున్నారు.

    ఆయన తెచ్చిన రెడ్ బుక్‌ గురించి, వైసీపీ నేతలు(YCP Leaders) మాట్లాడుతున్నారంటే.. నారా లోకేష్ రేంజ్ పెరిగింది అనేందుకు ఇదే ఓ ఉదాహరణ. లోకేష్ Nara Lokesh వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టే ప్రకటన ఈ రోజు జరిగే అవకాశం ఉంది. లోకేష్‌ను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేయాలనే డిమాండ్‌ను, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామంటున్నారు మరికొందరు నేతలు. మొత్తానికి ఈ రోజు మహానాడులో పార్టీ పగ్గాల విషయంలో టీడీపీ హై కమాండ్‌(TDP High Command) మహా నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి.

    More like this

    Manisha Koirala | నేపాల్‌లో హింసాత్మక ఆందోళనలు.. ఇది ఫొటో కాదు.. హింసకు సాక్ష్యం అంటూ మ‌నీషా కోయిరాలా పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Manisha Koirala | పొరుగు దేశం నేపాల్ లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఆందోళనలు తీవ్ర...

    CP Sai Chaitnaya | జానకంపేట లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సీపీ పూజలు

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitnaya | జానకంపేట (janakamPet) లక్ష్మీనృసింహస్వామిని (Lord Lakshmi Narasimha Swamy) సీపీ...

    Stock Market | నిలదొక్కుకున్న మార్కెట్లు.. 81 వేల మార్క్‌ను మరోసారి దాటిన సెన్సెక్స్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | గత నాలుగైదు సెషన్లు కొనసాగుతున్న ట్రెండ్‌కు బ్రేక్‌ పడిరది. ఒడిదుడుకులకు...