HomeUncategorizedMahanadu | నేడు మ‌హానాడు చివ‌రి రోజు.. జ‌గ‌న్ సొంత జిల్లాలో స‌త్తా చూపేందుకు టీడీపీ...

Mahanadu | నేడు మ‌హానాడు చివ‌రి రోజు.. జ‌గ‌న్ సొంత జిల్లాలో స‌త్తా చూపేందుకు టీడీపీ సైన్యం ప్లాన్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Mahanadu | ప్ర‌తి ఏడాది తెలుగుదేశం పార్టీ TDPఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మహానాడు’ కార్యక్రమం నేటితో ముగియ‌నుంది. క‌డ‌ప‌లో గ‌త రెండు రోజులుగా ఒక పండుగ‌లా జ‌రుపుకుంటున్నారు పార్టీ శ్రేణులు.పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటుగా పలు కీలక అంశాలపై మహానాడు(Mahanadu) వేదికగా మేధోమథనం జరుగుతుంది. కడప గడ్డపై మహానాడు నిర్వహించడం ఇదే తొలిసారి కాగా.. మహానాడులో పాల్గొనేందుకు అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివెళ్తున్నారు. ఇక మహానాడుకు లక్షల మంది కార్యకర్తలు వ‌చ్చినా కూడా వారంద‌రి క‌డుపు నింపేలా టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకుంది. 20 రకాలకు పైగా వంటకాలతో మహానాడు భోజనాల మెనూ సిద్ధం చేసింది.

Mahanadu | ప‌సుపు మయం..

ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ Dinner.. ఇలా మూడు పూటలా లక్షల మంది కార్యకర్తల ఆకలి తీరుస్తుండటంపై.. మహానాడుకు హాజరైన టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.ఇదే క్ర‌మంలో ఇప్పటికే రెండు రోజుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఈరోజు మూడో రోజు, చివరి రోజు కావడంతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయ‌బోతున్నారు. మహానాడులో భాగంగా తొలి రెండు రోజులు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ప్రతినిధుల సమావేశాలు నిర్విరామంగా జరిగాయి. ఈరోజు బహిరంగ సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఈ సభలో పార్టీ అధినేతతో పాటు ముఖ్య నాయకులు ప్రసంగించనున్నారు.

కడపలో జ‌ర‌గ‌నున్న‌ భారీ బహిరంగ సభ Public Meeting 5 లక్షల మందితో జరిపి వైఎస్ జగన్ YS Jagan సొంత జిల్లాలో టీడీపీ సైన్యం సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. కడప సహా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. ఒక్క ఉమ్మడి కడప జిల్లా నుంచే 2.10 లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి లక్షలాదిగా ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ఈ సభకు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. బహిరంగ సభకు వచ్చే వారి కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో లక్ష మందికి భోజన సౌకర్యం కల్పిస్తుండగా, కడపకు వెళ్లే మార్గాల్లో మరో రెండు లక్షల మందికి భోజనాలు సిద్ధం చేశారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ ప్రాంతం అంతా ప‌సుపు మ‌యం అయింది.