అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chikiri Chikiri Song | గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’పై (Peddi Movie) రోజురోజుకూ హైప్ పెరుగుతోంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి పెద్ద ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 27, 2026న విడుదల కానుంది.రామ్ చరణ్ (Hero Ram Charan) గత చిత్రం గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయిలో నిలవకపోవడంతో, అభిమానులంతా ‘పెద్ది’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Chikiri Chikiri Song | పర్‌ఫార్మెన్స్ అదుర్స్..
గ్రామీణ నేపథ్యంతో, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ కు అద్భుత స్పందన లభించింది. చరణ్ చెప్పిన ఉత్తరాంధ్ర డైలాగ్… చివరలో క్రికెట్ షాట్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాయి. ఇటీవల ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ‘చికిరి చికిరి’ పాట (Chikiri Chikiri Song) యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. రెహమాన్ మెలోడీ, చరణ్ ఎనర్జీ, జాన్వీ గ్లామర్ కలిసి ఈ సాంగ్‌ను బ్లాక్‌బస్టర్ చేశాయి. ప్రస్తుతం ఈ పాటకు 75 మిలియన్లకు పైగా వ్యూస్ రావడంతో సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయ్యింది.
ఈ పాటకు యువత మాత్రమే కాక.. పలువురు ప్రముఖులు కూడా ఫిదా అవుతున్నారు. లేటెస్ట్‌గా కడప జిల్లా టీడీపీ నేత (TDP Leader), రైల్వే కోడూరుకు చెందిన పంతగాని నరసింహ ప్రసాద్ ఈ పాటకు స్టెప్పులేస్తూ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆయన పార్టీ సాంస్కృతిక విభాగ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు ఆయన దివంగత మాజీ ఎంపీ, నటుడు శివప్రసాద్ గారి అల్లుడు కూడా.. అయితే తాజాగా జరిగిన ఓ కుటుంబ వేడుకలో సోదరుడు, భార్య, బంధువులతో కలిసి ఆయన ‘చికిరి చికిరి’ పాటకు ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేశారు. ఆ వీడియోను స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. సరదాగా చేసిన నా డ్యాన్స్ చూసి రాంచరణ్ ఫ్యాన్స్ కోప్పడకండి” అని క్యాప్షన్ రాశారు. ఈ వీడియో వైరల్ కాగానే దర్శకుడు బుచ్చిబాబు సానా (Director Buchibabu Sana) కూడా రీట్వీట్ చేస్తూ “బాగుంది” అంటూ కామెంట్ చేయడంతో మరింత దృష్టిని ఆకర్షించింది.
🤩🤍🙏🏻🧿 https://t.co/MJlAKa7uMC
— BuchiBabuSana (@BuchiBabuSana) November 21, 2025
