ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​TDP | తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ.. ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టీకరణ

    TDP | తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ.. ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టీకరణ

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: TDP : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత (Telugu Desam Party chief), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(AP CM Chandrababu) వెల్లడించారు. తెలంగాణ(Telangana) రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ తిరిగి క్రియాశీలక పాత్ర పోషించనుందని చెప్పారు. ఈ మేరకు ఓ చానల్ నిర్వహించిన పాడ్కాస్ట్ లో ఆయన కీలక విషయాలు వెల్లడించారు.

    తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాష్ట్రానికి చెందినది కాదని, తెలుగు జాతి సమగ్ర వికాసాన్ని ధ్యేయంగా పెట్టుకుని.. తెలుగువారు ఎక్కడ ఉన్నా వారిని బలోపేతం చేయాలనే ఆశయంతో స్థాపించిన పార్టీ అని బాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ స్థాపన వెనుక ఉన్న ప్రాథమిక సిద్ధాంతాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్టీని స్థాపించినప్పుడు ‘తెలుగు జాతి అభివృద్ధి’ అనే నినాదంతో ముందుకు వచ్చామని, తెలుగువారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. వారి ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని వివరించారు.

    ‘తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలంగాణలో’ అని ఆయన వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత తాత్కాలికంగా ఎదురైన కొన్ని సమస్యల వల్ల తెలంగాణలో పార్టీ బలహీనపడిందని అంగీకరించిన చంద్రబాబు.. వాటిని అధిగమించి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

    TDP : తెలుగు జాతి అభ్యున్నతే ముఖ్యం

    రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు జాతి అభ్యున్నతే ప్రధానంగా పని చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. 2041 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉండాలనేదే తన ధ్యేయమన్నారు. ఈ లక్ష్య సాధనకు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలంగా ఉండటం కూడా ముఖ్యమని చెప్పారు.

    అండమాన్(Andaman) వంటి చిన్న ప్రాంతాలలో కూడా తమ పార్టీ మున్సిపల్ ఛైర్మన్​(municipal chairman)ను గెలిపించిందని.. ఇది ఇతర రాష్ట్రాలలో విస్తరణకు ఉన్న అవకాశాలకు నిదర్శనమని చంద్రబాబు ఉదాహరించారు. పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించే ఆలోచన మొన్నటివరకు లేదని.. కానీ, ఇప్పుడు పరిస్థితులను బట్టి పార్టీని విస్తరిస్తామని తెలిపారు. తద్వారా తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెడతామని చెప్పారు.

    TDP : బాబు ప్రకటనపై ఆసక్తికర చర్చ..

    తెలంగాణలో పోటీ చేస్తామన్న చంద్రబాబు ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ తెలంగాణ బరిలో నిలిస్తే ఎంతో కొంత ప్రభావం చూపడం ఖాయం. అయితే, అది ఏ పార్టీని దెబ్బ తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. 2023 చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్లడంతో రాజకీయ వాతావరణం మారింది.

    ఈ నేపథ్యంలో టీడీపీ మళ్లీ బరిలోకి దిగడం అనేక రకాలుగా ప్రభావం చూపించే అవకాశముంది. తెలంగాణలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్​తో పాటు బీజేపీకి టీడీపీ నిర్ణయం ఒకింత కలవరపాటుకు గురి చేసే అంశమే. అయితే, ఏపీలో కూటమి కట్టిన బీజేపీ(BJP), టీడీపీ(TDP), జనసేన(JANASENA).. తెలంగాణలోనూ జట్టు కట్టి పోటీ చేసే అవకాశముందన్న వాదన వినిపిస్తోంది. ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఓట్లు చీలిపోవడం వల్ల కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) ఓటు షేర్​ను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

    Latest articles

    Assembly Speaker | వారి భ‌విత‌వ్య‌మేమిటో?.. ఆందోళ‌న‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Assembly Speaker | తెలంగాణ‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న క‌నిపిస్తోంది. ప‌ద‌వులు ఉంటాయో...

    Operation Akhal | జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు టెర్రరిస్టుల హతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Akhal | జమ్మూ కశ్మీర్​ (Jammu and Kashmir)లో భారీ ఎన్​కౌంటర్ (Encounter)​...

    South Africa | డివిలియ‌ర్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. పాక్‌ని చిత్తుగా ఓడించి టైటిల్ ఎగ‌రేసుకుపోయిన సౌతాఫ్రికా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: South Africa : గ‌త కొద్ది రోజులుగా WCL 2025 (వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్)...

    Weather Updates | నేడు తేలికపాటి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో వారం రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు. ఎండలు దంచి...

    More like this

    Assembly Speaker | వారి భ‌విత‌వ్య‌మేమిటో?.. ఆందోళ‌న‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Assembly Speaker | తెలంగాణ‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న క‌నిపిస్తోంది. ప‌ద‌వులు ఉంటాయో...

    Operation Akhal | జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు టెర్రరిస్టుల హతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Akhal | జమ్మూ కశ్మీర్​ (Jammu and Kashmir)లో భారీ ఎన్​కౌంటర్ (Encounter)​...

    South Africa | డివిలియ‌ర్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. పాక్‌ని చిత్తుగా ఓడించి టైటిల్ ఎగ‌రేసుకుపోయిన సౌతాఫ్రికా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: South Africa : గ‌త కొద్ది రోజులుగా WCL 2025 (వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్)...