Homeబిజినెస్​TCS Company | టీసీఎస్ నుండి 80వేల మంది ఉద్యోగులు ఔట్.. బ‌ల‌వంతంగా రిజైన్ చేయిస్తుందా?

TCS Company | టీసీఎస్ నుండి 80వేల మంది ఉద్యోగులు ఔట్.. బ‌ల‌వంతంగా రిజైన్ చేయిస్తుందా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TCS Company | దేశంలోని టెక్‌ ప్రపంచంలోనే అగ్రగామి ఐటీ కంపెనీలలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగాల విషయంలో పెద్ద షాక్ ఇచ్చింది.

“ఒకసారి టీసీఎస్‌లో ఉద్యోగం వస్తే.. జీవితాంతం భద్రతే” అని భావించే వారిని నిరాశపరిచే విధంగా, కంపెనీ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. టీసీఎస్(Tata Consultancy Services) ఇటీవల తన మొత్తం మానవవనరులలో 2 శాతం ఉద్యోగులను తొలగించినట్లు అధికారికంగా ప్రకటించింది. అంటే ఇది సుమారు 12,000 ఉద్యోగాలు. కానీ సోషల్ మీడియా వేదికగా మాజీ ఉద్యోగులు, ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నది ఏంటంటే దాదాపు 80,000 మంది ఉద్యోగులను తొలగించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

TCS Company | బలవంతపు రాజీనామాలు?

ఈ తొలగింపుల్లో చాలా వరకు ఉద్యోగులను బ‌ల‌వంతంగా పంపించే విధానాన్ని టీసీఎస్ అవలంబించిందని ఆరోపణలు వస్తున్నాయి. కొంతమందిని బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారని, కొందరిని అకస్మాత్తుగా ప్రాజెక్ట్ నుంచి తొలగించి బెంచ్ మీద పెట్టి, తరువాత రిలీవ్ చేస్తున్నారని పలువురు ఉద్యోగులు ట్వీట్ల ద్వారా వెల్లడించారు. ఇటీవల ఓ సీనియర్ ఉద్యోగిని “రిటైర్మెంట్ తీసుకోండి” అంటూ హెచ్‌ఆర్ వర్గాలు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. కానీ ఆయనకు ఇంకా పలు సర్వీసు లీఫ్లు మిగిలి ఉన్నప్పటికీ, స్వచ్ఛంద రిటైర్మెంట్ పేరుతో ఉద్యోగం కోల్పోయారు.ఈ భారీ ఉద్యోగాల తొలగింపు వెనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) కూడా ఒక కీలక పాత్ర పోషిస్తోంది

కంపెనీలు అభివృద్ధి చేసిన టూల్స్ ద్వారా, ముందుగా మనుషులు చేయాల్సిన పనులు ఇప్పుడు ఏఐ వేగంగా పూర్తి చేస్తోంది. ఇది కంపెనీలకు ఖర్చులు తగ్గించే మార్గం కావడంతో ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. టీసీఎస్‌తో పాటు యాక్సెంచర్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా గత కొద్ది నెలలుగా ఉద్యోగుల తొలగించే ప్ర‌య‌త్నాలు చేస్తుంది.. ఇదే ట్రెండ్‌ కొనసాగుతుండటంతో, టెక్ రంగంలో ఉన్న వేలాది మంది ఉద్యోగులకు భవిష్యత్ అనిశ్చితిగా మారుతోంది. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే #TCSLayoffs, #ForcedResignations, #ITJobs వంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఉద్యోగ భద్రత లేదనే భయం ఐటీ రంగంలోని పలు కంపెనీల ఉద్యోగుల్లో నెలకొంది.