అక్షరటుడే, ఇందూరు: Red Cross Society | టీబీ వ్యాధిగ్రస్తులకు రెడ్‌క్రాస్ సొసైటీ అండగా నిలవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఉత్తమ సేవలకు గాను కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ సొసైటీ ప్రతినిధులను సన్మానించారు.
Red Cross Society | ‘టీబీ ముక్త్ భారత్’ ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని (TB Mukt Bharat program) ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇటీవల గవర్నర్ జిల్లా పర్యటనలో కూడా టీబీ గురించి మాట్లాడినట్టు గుర్తు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit), రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు, రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మనోహర్ రెడ్డి, రెడ్‌క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి రవీందర్, కార్యదర్శి అరుణ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.