HomeతెలంగాణHarish Rao | కాంగ్రెస్ పాల‌న‌లో ప‌న్నుల పోటు.. మాజీ మంత్రి హ‌రీశ్‌రావు విమ‌ర్శ‌లు

Harish Rao | కాంగ్రెస్ పాల‌న‌లో ప‌న్నుల పోటు.. మాజీ మంత్రి హ‌రీశ్‌రావు విమ‌ర్శ‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | పాల‌న‌లో విఫ‌ల‌మైన కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌పై ప‌న్నుల భారం వేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమ‌ర్శించారు. సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయం(Siddipet Camp Office)లో జెండా ఎగుర‌వేసిన అనంత‌రం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్ పన్నులు దించితే.. రేవంత్ రెడ్డి పెంచుతుండని ధ్వ‌జ‌మెత్తారు.రెండేళ్ల రేవంత్(Revanth Reddy) పాలనలో ప్రజలపై అప్పుల, పన్నుల భారంపై మోపార‌న్నారు. ప్రజలపై పన్నులు వేయడం లేదని శాసనసభలో చెబుతున్నారు.. బ‌య‌ట మాత్రం విచ్చ‌ల‌విడిగా బాదుతున్నార‌ని తెలిపారు.

Harish Rao | బాదుడే బాదుడు..

తెలంగాణ ఇప్ప‌టికే ఆర్థిక మాంద్యంలో ఉంద‌ని, వ‌రుస‌గా రెండో నెల కూడా ఇదే ప‌రిస్థితి అని హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. పాలనలో పూర్తిగా విఫలమైన ప్ర‌భుత్వం.. రోజుకో పన్ను వేస్తూ ప్రజలకు షాక్ ఇస్తున్నదని విమ‌ర్శించారు. గత నెల, ఈ నెలలో క‌లిపి ఒక్క ర‌వాణా శాఖ ద్వారానే రెండు వేల కోట్ల భారం మోపార‌న్నారు. గతంలో 100 ఉన్న సర్వీస్ టాక్స్‌ను 200 చేశారని, వెహికిల్ సర్వీస్ టాక్స్ 400 నుంచి వన్ పర్సంటేజ్ కు పెంచారన్నారు. రోడ్ టాక్స్(Road Tax) నూ పెంచారు, మోటార్ సైకిల్ టాక్స్(Motorcycle Tax) ను నాలుగైదు వేలకు పెంచారని విమ‌ర్శించారు. పెనాల్టీల పేరిట గత నెల వెయ్యి కోట్లు, ఈ నెల వెయ్యి కోట్లు క‌లిపి మొత్తం రెండు వేల కోట్ల భారం వేశార‌న్నారు. గతంలో 7100 కోట్లు టాక్స్ వసూలు అయితే.. గతేడాది 6900 కోట్లు మాత్రమే వచ్చిందని తెలిపారు.

Harish Rao | మా హ‌యాంలో ప‌న్నులే పెంచ‌లేదు..

బడ్జెట్ 8000 కోట్లు అంచనా వేశారు.. ఇదే లా సాధ్యమని ప్ర‌శ్నించారు. అసెంబ్లీలో సుద్దపూస మాటలు చెబుతూ బ‌య‌ట మాత్రం అన్ని పన్నులను పెంచేశార‌ని విమ‌ర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాల‌న‌లో ర‌వాణాశాఖ‌(Transport Department)లో ప‌న్నులు రద్దు చేసి పేదలకు సాయం చేశామ‌ని చెప్పారు. కానీ కాంగ్రెస్ మాత్రం బాదుతున్న‌ద‌న్నారు. పేదలపై వేసిన ఈ పన్నుల భారాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ చర్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నరన్నారు. మేము పన్నులు తొలగిస్తే.. మీరు పన్నులు వేస్తున్నారు.. కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే ఇదేనా అని ప్ర‌శ్నించారు.

Harish Rao | పండుగ‌ల‌కూ వ‌ద‌ల‌ట్లేదు..

ఆర్ అండ్ బీ, పంచాయ‌తీరాజ్‌లో యాన్యూటీ మోడల్ లో రోడ్లు వేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. ప్రజలపై దొడ్డి దారిన భారం వేసి వాటితో అప్పులు కడతారని, ఈ విధానాన్ని ఉపసంహరించాలని కోరారు. పండగలు వస్తె పాపం.. పండగకు ముందు వారం, పండగ తరువాత వారం ఆర్టీసీ చార్జీలు డబుల్ చేస్తున్నారని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పంచుడు బందు చేసి, పెంచుడు షురూ చేసింద‌న్నారు. మద్యం ధరలు రెండు సార్లు పెంచారన్న హ‌రీశ్‌రావు.. ప్రతి గ్రామానికి మద్యం షాపులు తెరుస్తారట. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా రెపో మాపో పంచుతారట. ఇలా పెంచుకుంటుపోతూ పేద ప్రజల రక్తమాంసాలు పిలుస్తారా? అని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఢిల్లీకి డబ్బుల సంచులు మోసుడు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. నీ ఆర్ఆర్ టాక్స్ వల్ల రాష్ట్రంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గిందని ఆరోపించారు.

Must Read
Related News