అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tata Punch EV | దేశీయ ఆటోమొబైల్ రంగ దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) కొత్త పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ను భారత్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. నవీకరించిన టాటా పంచ్ ఈవీ 30 కేడబ్ల్యూహెచ్, 40 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌లలో అందుబాటులో ఉంటుంది. గరిష్టంగా 468 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. అయితే రియల్ వరల్డ్ రేంజ్ 355 కిమీ వరకు ఉంటుందని తెలుస్తోంది.
Tata Punch EV | ఫాస్ట్ చార్జర్..
65కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ చార్జర్‌ను ఉపయోగించి 26 నిమిషాల్లోనే 20 నుంచి 80 శాతం వరకు రీఫిల్ చేయవచ్చు. 15 నిమిషాల ఫాస్ట్ చార్జింగ్‌తో 135 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
ఎలక్ట్రిక్ మోటారు 130 పీఎస్ ఉత్పత్తి చేస్తుంది. తొమ్మిది సెకన్లలో 0 నుంచి 100 కేఎంపీహెచ్ ను అందుకుంటుంది. వీల్ టార్క్ 2000 ఎనఎం కంటే ఎక్కువగా ఉంటుంది.
టాటా మోటార్స్ కొత్త పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇల్యూమినేటెడ్ చార్జింగ్ స్టేటస్ ఇండికేటర్ ఉన్నాయి.
డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్
డ్రైవర్లు స్టీరింగ్ మౌంటెడ్ ప్యాడిల్స్ ద్వారా నియంత్రించబడే నాలుగు ఎంచుకోదగిన పునరుత్పత్తి బ్రేకింగ్ స్థాయిలతో పాటు ఎకో, సిటీ లేదా స్పోర్ట్స్ డ్రైవింగ్ మోడ్‌లను ఎంచుకోవచ్చు. డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, కొత్త విండో కంట్రోల్ బటన్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మొదలైనవి ఉన్నాయి.
ఫేస్‌లిఫ్ట్ ఆరు వ్యవస్థలను ఒకే యూనిట్‌గా కలిపి సెగ్మెంట్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎక్స్ ఇన్ 1 ఇ-డ్రైవ్ మాడ్యూల్‌ను కూడా పరిచయం చేస్తుంది. ఇది ప్యాకేజింగ్ పరిమాణాన్ని దాదాపు 50 శాతం తగ్గిస్తుంది.
డిజైన్ పరంగా రిఫ్రెష్డ్ ఫాసియా, చుట్టూ బూడిద రంగు బాడీ క్లాడింగ్, కొత్త ఎలఈడీ టెయిల్ లైట్స్, వెనుక భాగంలో ఎలఈడీ లైట్ బార్ ఉన్నాయి. మిగిలిన డిజైన్ దాదాపు సాధారణ ఏవీ పంచ్ మాదిరిగానే ఉంటుంది.
రూ. 9.69 లక్షలనుంచి ప్రారంభం
30 కేడబ్ల్యూహెచ్ లైనప్ స్మార్ట్ రూ. 9.69 లక్షలనుంచి స్మార్ట్ ప్లస్ రూ. 10.29 లక్షలనుంచి, 40 కేడబ్ల్యూహెచ్ లైనప్ స్మార్ట్ రూ. 10.89 లక్షలనుఉంచి స్మార్ట్ ప్లస్ రూ. 11.59 లక్షలనుంచి, అడ్వెంచర్ రూ. 12.29 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. (ఎక్స్ షోరూం ధరలు)