CFO of the Year award | టాటా పవర్ సీఎఫ్‌ఓ సంజీవ్ చురివాలాకు ‘సీఎఫ్‌ఓ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
CFO of the Year award | టాటా పవర్ సీఎఫ్‌ఓ సంజీవ్ చురివాలాకు ‘సీఎఫ్‌ఓ ఆఫ్ ది ఇయర్’ అవార్డు

అక్షరటుడే, హైదరాబాద్: CFO of the Year award | టాటా పవర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ Tata Power Chief Financial Officer (CFO)సంజీవ్ చురివాలాకు ప్రతిష్ఠాత్మక ‘సీఎఫ్‌ఓ ఆఫ్ ది ఇయర్’ అవార్డు వరించింది.

హైదరాబాద్‌లో జరిగిన 4వ ఎడిషన్ సీఐఐ సీఎఫ్‌ఓ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024-2025 వేడుకలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) అన్ని విభాగాల్లో ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేసింది.

ఆర్థిక రంగంలో ఆయన చేస్తున్న అద్భుతమైన కృషి, సుస్థిరమైన వృద్ధి, వ్యూహాత్మక విలువ సృష్టికి ఈ గుర్తింపు లభించింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో ఈ అవార్డును ఆయనకు అందజేశారు.

CFO of the Year award | టాటా పవర్‌లో గ్రీన్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్‌

విలీనాలు (M&A), నిధుల సమీకరణ, టాటా పవర్‌లో గ్రీన్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించడంలో ఆయనకున్న నైపుణ్యానికి ఈ అవార్డు వరించింది.

లండన్ బిజినెస్ స్కూల్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ పూర్తి చేసిన చార్టర్డ్ అకౌంటెంట్ అయిన చురివాలా.. గత 30 సంవత్సరాలుగా ఆర్థిక రంగంలో గొప్ప మార్పులు, పాలన, దీర్ఘకాలిక విలువ సృష్టిని నిరంతరంగా ప్రోత్సహించారు.

ఆయన నాయకత్వంలో టాటా పవర్ తన ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేసుకుంది. అంతేకాకుండా, ఇది సంస్థ సుదీర్ఘ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, పెట్టుబడుల కేటాయింపులను మెరుగుపరిచింది.

సీఐఐ ప్రదానం చేసిన ఈ గౌరవం, ఆర్థిక నిర్వహణతో పాటు పర్యావరణ పరిరక్షణ, సమ్మిళిత భవిష్యత్తును నిర్మించాలనే టాటా పవర్ లక్ష్యానికి లభించిన గుర్తింపుగా నిలిచింది.

సీఐఐ సీఎఫ్‌ఓ ఎక్సలెన్స్ అవార్డుల కోసం, ఆర్థిక ఫలితాలతో పాటు పాలన, ఆవిష్కరణ, సుస్థిరత, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, నైతిక విధానాలను పరిగణనలోకి తీసుకుని విజేతలను స్వతంత్ర జ్యూరీ ఎంపిక చేస్తుంది.