అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tata Motors | పండుగ సందర్భంగా కస్టమర్లను ఆకర్షించేందుకు పలు కంపెనీలు యత్నిస్తున్నాయి. భారీ డిస్కౌంట్లతో సేల్స్ పెంచుకోవడానికి ఎత్తులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ అయిన టాటా మోటార్స్ దీపావళి పండుగ (Diwali Festival) సందర్భంగా ఆఫర్లను ప్రకటించింది.
పలు మోడళ్లపై రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. పెట్రోల్, డీజిల్‌తోపాటు ఎలక్ట్రిక్ వాహనాలపైనా తగ్గింపు ధర అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లు అక్టోబర్ 21 వరకు అందుబాటులో ఉండనున్నాయి. క్యాష్ డిస్కౌంట్స్‌తోపాటు ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాప్ బెనిఫిట్స్, లాయల్టీ బోనస్, గ్రీన్ ఇన్సెంటివ్స్(Green incentives) వంటివి ఉన్నాయి. మే 2024 నుంచి మే 2025 వరకు తయారైన మోడల్ కార్లకు ఈ ఆఫర్ వర్తించనుంది.
Tata Motors | ఆఫర్లు ఇవే..
- టాటా టియాగో(Tata Tiago) పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లపై రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు కన్సూమర్ డిస్కౌంట్స్ లభించనుంది. ఎక్స్చేంజ్ బోనస్ రూ. 15 వేలవరకు వర్తించనుంది.
- టాటా ఆల్ట్రోజ్(Tata Altroz) పెట్రోల్, సీఎన్‌జీ, డీజిల్ వేరియంట్ కార్లపై రూ. 50 వేల వరకు కన్సూమర్ బెనిఫిట్స్‌తోపాటు ఎక్స్చేంజ్ కింద రూ. 50 వేల వరకు తగ్గింపు లభించనుంది. ఆల్ట్రోజ్ రేసర్ పెట్రోల్ వేరియంట్ మే 2024 కారుపై రూ. 1.35 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తాయి.
- టాటా నెక్సాన్(Tata Nexon) పెట్రోల్, సీఎన్‌జీ, డీజిల్ వేరియంట్లపై రూ. 35 వేల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 10 వేలు ఎక్స్చేంజ్ బోనస్ వర్తిస్తాయి.
- టాటా పంచ్(Tata Punch) కారు పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లపై రూ. 25 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.
- టాటా హారియర్(Tata Harrier), సఫారీ డీజిల్ కార్లపై రూ. 50 వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 25 వేల ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు.
- టాటా కర్వ్(Tata Curvv) పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై రూ. 30 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ ఏడాది మే తర్వాత తయారైన టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, కర్వ్, హారియర్, సఫారీలపై రూ. 25 వేల నుంచి రూ. 65 వేల వరకు తగ్గింపు వర్తిస్తుంది. - టాటా హారియర్ ఫియర్‌లెస్ ఎక్స్ ప్లస్, సఫారీ ఎక్స్ ప్లస్ మోడల్స్‌పై రూ. 50 వేల వరకు ప్రయోజనాలు లభిస్తాయి.
- టాటా నెక్సాన్(Tata Nexon) కారుపై రూ. 2 లక్షల వరకు (డీలర్ ఆఫర్, డిస్కౌంట్, జీఎస్టీ తగ్గింపు వంటివి కలుపుకుని) బెనిఫిట్స్ అందనున్నాయి.
Tata Motors | ఎలక్ట్రిక్ కార్లపై..
టాటా కర్వ్ ఈవీ(EV)పై రూ. 1.90 లక్షల వరకు తగ్గింపు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో రూ. 70 వేల గ్రీన్ బోనస్, రూ. 30 వేల ఎక్స్చేంజ్ బోనస్, రూ. 10 వేల కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 50 వేలు లాయల్టీ బోనస్ వంటివి ఉంటాయి.
టాటా టియాగో ఈవీ కారుపై రూ. 1.23 లక్షల బెనిఫిట్స్ వర్తించనున్నాయి. ఇందులో రూ. 70 వేల గ్రీన్ బోనస్, రూ. 30 వేల ఎక్స్చేంజ్ బోనస్(Exchange bonus) ఉన్నాయి.
టాటా పంచ్ ఈవీ కారుపై రూ. 60 వేల గ్రీన్ బోనస్, రూ. 40 వేల ఎక్స్చేంజ్ బోనస్ సహా మొత్తం రూ. 1.23 వేల బెనిఫిట్స్, టాటా హారియర్ ఈవీ కారుపై లక్ష రూపాయల వరకు లాయల్టీ బోనస్ పొందడానికి అవకాశాలు ఉన్నాయి.
టాటా నెక్సాన్ ఈవీ కారుపై రూ. 90 వేల వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో రూ. 30 వేలు ఎక్స్చేంజ్ బోనస్, రూ. 10 వేల కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 50 వేల లాయల్టీ బోనస్ కలిపి ఉంటాయి.