అక్షరటుడే, వెబ్డెస్క్ : EV Charging Station | ఎలక్ట్రిక్ వాహనదారులకు టాటా గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రహదారులపై 14 ఈవీ మ్యాన్డ్ మెగాచార్జర్లను ప్రారంభించింది. దఇందుకోసం టాటా ఈవీ వోల్ట్రాన్ (Tata EV Voltron)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు (Electric Vehicles) డిమాండ్ పెరిగింది. ప్రజలు ద్విచక్ర వాహనాలు నుంచి కార్ల వరకు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజా రవాణా వ్యవస్థ కోసం ఎలక్ట్రిక్ బస్సు (Electric Buses)లను కొనుగోలు చేస్తున్నాయి. కాలుష్యం తగ్గడంతో పాటు, ఫ్యూయల్ ఛార్జీలు కలిసొస్తాయని వీటిని కొంటున్నారు. ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరగనుంది. అయితే చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రయాణాలు చేయాల్సిన సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకు వెళ్తే మధ్యలో చార్జింగ్ అయిపోతే ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
EV Charging Station | టాటా కీలక చర్యలు
ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఇప్పటికే పలు ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్లు (Charging Stations) అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా టాటా సంస్థ తెలుగు రాష్ట్రాల్లోని పలు రహదారులపై 14 మ్యాన్డ్ మెగా చార్జర్లను అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సదుపాయాలను మెరుగుపరచడం కోసం వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఆయా చార్జింగ్ స్టేషన్‌లలో వినియోగదారులకు సహాయం చేయడానికి సిబ్బంది అందుబాటులో ఉంటారు. వీటితో ఈవీ వాహనాల వినియోగం పెరుగుతుందని టాటా తెలిపింది. హైవేలపై ఉన్న కీలక ప్రదేశాలలో చార్జర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
