ePaper
More
    HomeజాతీయంAir India Plane Crash | విమాన ప్ర‌మాదం.. భారీ ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన టాటా గ్రూప్

    Air India Plane Crash | విమాన ప్ర‌మాదం.. భారీ ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన టాటా గ్రూప్

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India Plane Crash : అహ్మదాబాద్ లో జ‌రిగిన ఘోర విమాన ప్ర‌మాదం యావత్ దేశాన్ని కదిలించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 240 మందికి పైగా మృతి చెందిన‌ట్టు తెలుస్తుంది.

    గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం (Sardar Vallabhbhai Patel International Airport) నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలిపోయింది. లండన్‌కు వెళ్తున్న విమానం నగరంలోని మేఘాని ప్రాంతంలోని ఓ మెడికల్‌ కాలేజీ హాస్టల్‌పై కూలిపోయింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది. గాల్లోకి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో అంద‌రు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ప్ర‌మాదం గురించి తెలుసుకున్న కేంద్ర‌మంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister) అక్క‌డికి చేరుకొని అక్క‌డ ఘటనపై ఆరతీశారు.

    Air India Plane Crash : భారీ ఎక్స్‌గ్రేషియా..

    డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation – DGCA) ప్రకారం.. విమానంలో 242 మంది ఉన్నారు. అందులో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. విమానం కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ ఆధ్వర్యంలో వెళ్లాల్సి ఉంది. టేకాఫ్ అయిన స్వల్ప వ్యవధిలోనే ఈ దుర్ఘటన జరిగిపోయింది.

    కొద్ది రోజుల క్రితమే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. జూన్ 7న ఢిల్లీ నుంచి పారిస్ వెళ్తున్న విమానంలో సమస్య తలెత్తడంతో ఎలక్ట్రిక్ ఎర్రర్, కాలిన వాసన రావడంతో షార్జా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. తక్షణమే పైలట్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో నాడు ప్రమాదం తప్పింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన విమానం కూడా ఎయిర్ ఇండియా (AI 143) వినియోగించిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ రకమే కావడం గమనార్హం.

    కాగా.. ఈ ప్రమాదంలో మరణించిన వారికి టాటా గ్రూప్ TATA GROUP భారీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం ఇవ్వనున్నట్లు టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ (Tata Group Chairman Chandrasekaran) ప్రకటించారు. అలాగే విమాన ప్రమాద సమయంలో దెబ్బ తిన్న మెడికల్ కాలేజీ బిల్డింగ్ ను కూడా పునర్మిస్తామని కూడా తెలిపారు.

    అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అద్భుతం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. “పోలీసులు 11A సీటులో ప్రాణాలతో బయటపడిన ఒకరిని కనుగొన్నారు. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరణాల సంఖ్య గురించి ఇంకా ఏమీ చెప్పలేం. విమానం నివాస ప్రాంతంలో కూలిపోవడంతో మరణాల సంఖ్య పెరగవచ్చు.” అని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ GS maalik మాలిక్ తెలిపారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...