అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tata EV Discount Offers | విద్యుత్ వాహన కొనుగోలుదారులకు టాటా (TATA) బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి టిగోర్ ఈవీ మినహా మిగిలిన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిపై కొనుగోలు ప్రయోజనాలను ప్రకటించింది.
మోడల్ ఇయర్ 2025, 2026 వాహనాలపై డిస్కౌంట్ ఇస్తున్నట్లు టాటా ప్రకటించింది. టాటా అన్ని ఎలక్ట్రిక్ మోడళ్లలో, కర్వ్ ఈవీ (tata curvv) ఈ నెలలో అత్యంత ఆకర్షణీయమైన పథకాలతో అందుబాటులో ఉంది. ఈ ఫిబ్రవరిలో మోడల్ ఇయర్ 2025 కర్వ్ ఈవీని ఎంచుకునే కొనుగోలుదారులు రూ. 3.8 లక్షల వరకు ప్రయోజనాలను పొందుతారు. టాటా కర్వ్ 2026 ఈవీని కొనుగోలు చేయాలనుకునే వారు కారు షోరూమ్ ధరపై రూ.3,30,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కూపే-ఎస్యూవీ ఎంట్రీ-లెవల్ క్రియేటివ్ 45 వేరియంట్ ధర రూ. 17.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
Tata EV Discount Offers | టాటా పంచ్ ఈవీపై..
టాటా పంచ్ ఈవీ కార్ల ధరలు రూ.9.99 లక్షల నుంచి రూ. 14.44 లక్షల వరకు ఉన్నాయి. ఈ వాహనాలు కొనుగోలు చేసేవారికి రూ. 1.60 లక్షల వరకు ప్రయోజనం కల్పిస్తున్నట్లు టాటా తెలిపింది. ఇది కేవలం మోడల్ ఇయర్ 2025 యూనిట్లకు మాత్రమే వర్తిస్తుంది. 2026 బ్యాచ్‌కు చెందిన పంచ్ ఈవీ యూనిట్లపై ఆఫర్లు రూ. 90,000 వరకు మాత్రమే ఉన్నాయి. టాటా ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ, హారియర్ ఈవీలపై రూ.1.50 లక్షల వరకు డిస్కౌంట్ లభించనుంది. టాటా టియాగో విద్యుత్ కార్లపై రూ.1.50 లక్షల వరకు ప్రయోజనాలు ఉంటాయని సంస్థ తెలిపింది.