అక్షరటుడే, హైదరాబాద్: TATA AMC | టాటా అసెట్ మేనేజ్‌మెంట్, ఈక్వల్ – వన్‌మనీతో (Equal-OneMoney) కలిసి టాటా మ్యూచువల్ ఫండ్ యాప్‌లో వినూత్నమైన పోర్ట్‌ఫోలియో 360 (Portfolio 360) ఫీచర్‌ను ప్రారంభించింది.
అకౌంట్ అగ్రిగేటర్ వ్యవస్థ ఆధారంగా పనిచేసే ఈ సదుపాయం ద్వారా ఇన్వెస్టర్లు పూర్తి ఆర్థిక పోర్ట్‌ఫోలియోను ఒకేచోట చూసుకోవచ్చు. పారదర్శకంగా, తక్షణ చర్యకు వీలుగా తమ పెట్టుబడులను పరిశీలించే అవకాశం దీని ద్వారా లభిస్తుంది.
గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025లో (Global Fintech Fest 2025) ప్రదర్శించిన ఈ పోర్ట్‌ఫోలియో 360, ఇన్వెస్టర్లకు సమగ్ర ఆర్థిక విశ్లేషణలు, ప్రణాళికలు అందించే సింగిల్ ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తోంది.
TATA AMC | ఇన్వెస్టర్ల ప్రయాణంలో మైలురాయి
“పారదర్శకత, సరళత ద్వారా ఇన్వెస్టర్లకు (Investors) సాధికారత కల్పించాలని టాటా అసెట్ మేనేజ్‌మెంట్ విశ్వసిస్తుంది. వారి సంపద వివరాలను స్పష్టంగా, ఒకేచోట చూపించడం వల్ల వారు స్మార్ట్ నిర్ణయాలు తీసుకోగలరు. పెట్టుబడులను సరళతరం చేయటం, ఆర్థిక ప్లానింగ్‌ను డేటా ఆధారితంగా మరింత మందికి అందుబాటులోకి తీసుకురావటం లక్ష్యంగా సాగుతున్న మా ప్రస్థానంలో ఇది కీలక మైలురాయి..” అని టాటా అసెట్ మేనేజ్‌మెంట్ Tata Asset Management సీఈవో & ఎండీ ప్రతీత్ భోబె పేర్కొన్నారు.
TATA AMC | పోర్ట్‌ఫోలియో 360 ప్రత్యేకతలు:
- నిరాటంకమైన ఆన్‌బోర్డింగ్ (Seamless Onboarding): కొన్ని క్లిక్‌ల ద్వారా, పారదర్శక సమ్మతి విధానంతో, పూర్తి నియంత్రణతో బహుళ వనరుల నుంచి ఇన్వెస్టర్లు తమ ఆర్థిక డేటాలను సురక్షితంగా అగ్రిగేట్ చేసుకోగలరు.
- యూనిఫైడ్ ఫైనాన్షియల్ డ్యాష్‌బోర్డ్ (Unified Financial Dashboard) : వివిధ బ్యాంకు అకౌంట్లు, మ్యూచువల్ ఫండ్‌లు, ఈక్విటీలు, ఎఫ్‌డీల వ్యాప్తంగా నికర విలువ వివరాలను సమగ్రంగా ఒకే దగ్గర వీక్షించవచ్చు.
- స్మార్ట్ పోర్ట్‌ఫోలియో విశ్లేషణ (Smart Portfolio Analysis): ట్రెండ్ గ్రాఫ్‌లు, హోల్డింగ్స్ సారాంశం, ఈక్వల్-వన్‌మనీ అనలిటిక్స్ సాయంతో FIRE (Financial Independence, Retire Early) కాల్‌క్యులేటర్ వంటి వ్యక్తిగతీకరించిన సాధనాలు రియల్ డేటా ఆధారంగా రిటైర్మెంట్, ఆర్థిక స్వావలంబనకు ప్లాన్ చేసుకునేందుకు తోడ్పడతాయి.
కొన్ని నెలల క్రితం విడుదలైన టాటా మ్యూచువల్ ఫండ్ యాప్ ఇప్పటికే 6 లక్షలకు పైగా డౌన్‌లోడ్‌లు నమోదు చేసింది.
ఈ సందర్భంగా ఈక్వల్-వన్‌మనీ ఫౌండర్ & సీఈవో కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, “అకౌంట్ అగ్రిగేటర్ వ్యవస్థ శక్తిని ఇన్వెస్టర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు టాటా అసెట్ మేనేజ్‌మెంట్‌తో జట్టు కట్టడం సంతోషకరం. డేటా గోప్యత, భద్రత ప్రమాణాలు పాటిస్తూ, ఆర్థిక అవగాహన, ప్లానింగ్, స్వతంత్రతను ప్రతి భారతీయునికి అందుబాటులోకి తేవడానికి పోర్ట్‌ఫోలియో 360 తోడ్పడుతుంది..” అని పేర్కొన్నారు.
ఈక్వల్-వన్‌మనీ అకౌంట్ అగ్రిగేటర్ అనుభవాన్ని టాటా ఎంఎఫ్ యాప్‌తో జోడించడం ద్వారా డిజిటల్ ఇన్వెస్టర్ సొల్యూషన్స్‌లో పోర్ట్‌ఫోలియో 360 కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. పారదర్శకత, ఆవిష్కరణ, డేటా ఆధారిత విశ్లేషణల కలయికతో ఇన్వెస్టర్లు ఆత్మవిశ్వాసంతో ఆర్థిక నిర్ణయాలు తీసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.