అక్షరటుడే, ముంబై: TATA AIA | ఆర్థిక సేవల్లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంటూ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (Life Insurance Company Limited) కీలక విజయాన్ని సాధించింది. మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ ర్యాంకింగ్స్‌లో (Million Dollar Round Table Rankings) భారతదేశంలో వరుసగా మూడో ఏడాది కూడా అగ్రస్థానాన్ని నిలుపుకుంది. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి కంపెనీలలో నాలుగో స్థానానికి ఎగబాకింది. గతేడాదితో పోలిస్తే ఈసారి MDRT సభ్యుల సంఖ్య 11 శాతం పెరిగి 2,871కి చేరుకుందని టాటా ఏఐఏ (TATA AIA) హర్షం వ్యక్తం చేసింది.
TATA AIA | మహిళా సాధికారతలో ముందంజ..
వైవిధ్యం, సమ్మిళితత్వానికి టాటా ఏఐఏ ఇస్తున్న ప్రాధాన్యత ఈ విజయాలలో ప్రతిబింబిస్తుంది. ఈ సంస్థలో 1,343 మంది మహిళా MDRT సభ్యులు ఉండడం ఒక ఆల్‌టైమ్ హై రికార్డు(All Time High Record). మహిళా సభ్యత్వంలో ప్రపంచవ్యాప్తంగా టాప్ 25 కంపెనీలలో ఏడో స్థానంలో నిలవడం విశేషం. మహిళా MDRT అర్హత సాధించిన వారిలో 8.5 శాతం వృద్ధి, ఆర్థిక రంగంలో మహిళలను ప్రోత్సహించడానికి టాటా ఏఐఏ చేస్తున్న నిరంతర కృషికి నిదర్శనం. MDRT సభ్యత్వం అనేది జీవిత బీమా, ఆర్థిక సేవల నిపుణులకు అంతర్జాతీయంగా అత్యున్నత ప్రమాణంగా పరిగణించబడుతుంది.
TATA AIA | వ్యాపార వృద్ధికి చోదక శక్తి..
MDRT అర్హత కలిగిన సలహాదారులు బీమా సంస్థలకు గొప్ప బలాన్ని అందిస్తారు. వారి నిపుణులైన మార్గదర్శకత్వం వినియోగదారుల సంతృప్తిని పెంచి, బ్రాండ్‌పై విశ్వసనీయతను ఇనుమడింపజేస్తుంది. టాటా ఏఐఏలో, MDRT సలహాదారులు అద్భుతమైన సేవలను అందిస్తూ, బలమైన కస్టమర్ బేస్‌ను సృష్టించడంలో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక సంవత్సరం 2024-25లో, టాటా ఏఐఏ ఐదు పర్సిస్టెన్సీ (పాలసీ పునరుద్ధరణ) కోహోర్ట్‌లలో నాలుగింటిలో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ విజయంపై టాటా ఏఐఏ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ – ప్రొప్రైటరీ బిజినెస్, అలైడ్ ఛానెల్స్ అండ్ ఏజెన్సీ సేల్స్, అమిత్ డేవ్(Amit Dave) మాట్లాడుతూ.. “MDRT ర్యాంకింగ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలవడం, భారతదేశంలో పరిశ్రమకు నాయకత్వం వహించడం నిజంగా మాకు గర్వకారణం. ఈ మైలురాయి మా ప్రీమియర్ ఏజెన్సీ మోడల్ విజయానికి, మా సలహాదారుల అంకితభావానికి నిదర్శనం” అని పేర్కొన్నారు.