ముంబై: తమ కుటుంబ ఆర్థిక భద్రతను కాపాడుకుంటూనే, మార్కెట్ రాబడులను పొందాలనుకునే వారి కోసం టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్ వినూత్న పథకాలను తీసుకొచ్చింది. జీవిత బీమా కవరేజీతో పాటు ఈక్విటీ మార్కెట్ వృద్ధిలో భాగస్వామ్యం కల్పించడం ఈ ఫండ్స్ ప్రధాన ఉద్దేశం.
రెండు రకాల ఫండ్స్:
ఎన్హాన్స్డ్ వేల్యూ ఇండెక్స్ ఫండ్: ఇది పిల్లల భవిష్యత్తు, ఉన్నత చదువులు లేదా ఇతర ఆస్తుల సమకూర్చుకోవడం వంటి లక్ష్యాల కోసం రూపొందించబడింది. యూలిప్ (ULIP) ప్లాన్ల ద్వారా ఇది అందుబాటులో ఉంటుంది.
ఎన్హాన్స్డ్ వేల్యూ ఇండెక్స్ పెన్షన్ ఫండ్: రిటైర్మెంట్ తర్వాత నిశ్చింతగా ఉండాలనుకునే వారి కోసం ఇది ప్రత్యేకంగా పనిచేస్తుంది. టాటా AIA స్మార్ట్ పెన్షన్ సెక్యూర్ వంటి పథకాల ద్వారా దీనిని పొందవచ్చు.
ఎందుకు ఎంచుకోవాలి?: ఈ ఫండ్స్ బుక్ వేల్యూ, ఎర్నింగ్స్ మరియు సేల్స్ వంటి కీలక ఫండమెంటల్స్ ఆధారంగా అండర్ వేల్యూడ్ (తక్కువ ధరలో ఉన్న సత్తా ఉన్న) కంపెనీలను గుర్తిస్తాయి. తద్వారా మార్కెట్ పడిపోయినప్పుడు రక్షణగా ఉంటూ, పెరిగినప్పుడు గరిష్ట లాభాలను అందిస్తాయి. ప్రస్తుతం టాటా AIA దాదాపు రూ. 1.45 లక్షల కోట్ల ఆస్తులను (AUM) విజయవంతంగా నిర్వహిస్తోంది.