అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TASK Training | నిరుద్యోగ యువతకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు. టాస్క్(TASK) ద్వారా ఈ ఏడాది 4,100 ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) ప్రకటించారు.
టాస్క్ కార్యక్రమాలపై ఆయన శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లో ఇటీవల టాస్క్ ద్వారా శిక్షణను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆసక్తి గల యువతకు 30 రోజుల పాటు పరిశ్రామిక శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
TASK Training | త్వరలో 4,100 ఉద్యోగాలు
ఈ ఏడాదిలో టాస్క్ ద్వారా 4,100 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. టాస్క్ ద్వారా కనీసం 6 వేల మందికి శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. నైపుణ్య శిక్షణ అందించడంలో టాస్క్ గణనీయ పురోగతి సాధించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.