HomeUncategorizedSwarnandhra | స్వ‌ర్ణాంధ్ర 2027 లక్ష్య సాధ‌న‌కు సూచ‌న‌లు.. అమరావతిలో హైటెక్ సిటీ ఏర్పాటు

Swarnandhra | స్వ‌ర్ణాంధ్ర 2027 లక్ష్య సాధ‌న‌కు సూచ‌న‌లు.. అమరావతిలో హైటెక్ సిటీ ఏర్పాటు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Swarnandhra | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతిని కేంద్రీకరించుకుని, రింగ్‌ రోడ్ వెంబడి హైటెక్ సిటీ(Hitech City)ను అభివృద్ధి చేయాలని టాస్క్‌ఫోర్స్ సిఫార్సు చేసింది. ఇందులో కృత్రిమ మేధస్సు (artificial intelligence), సెమీకండక్టర్లు వంటి అత్యాధునిక పరిశ్రమలకు కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనేది కమిటీ అభిప్రాయం.ఈ నివేదిక “స్వర్ణాంధ్ర ప్రదేశ్ – 2047” లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని, దేశంలోని ప్రఖ్యాత పారిశ్రామిక సంస్థలతో కలిసి రూపొందించబడింది. ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, డ్రోన్స్ రంగాలపై రాష్ట్రం దృష్టి పెట్టాలని సూచించబడింది. తిరుపతిలోని శ్రీ సిటీ మోడల్‌ని ఇతర ప్రాంతాల్లో విస్తరించాలని సిఫారసు చేశారు.

Swarnandhra | అదే ల‌క్ష్యంగా..

360 పేజీల నివేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra babu naidu) ఢిల్లీలో విడుదల చేశారు. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఈ టాస్క్‌ఫోర్స్‌కు కో-చైర్మన్‌గా ఉన్నారు.అమరావతి (AP Capital Amaravati) పరిసరాల్లో మెడిసిటీ ఏర్పాటు చేయాలని కూడా నివేదికలో పేర్కొన్నారు.రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP)లో 72% ఆదాయం 15 జిల్లాల నుంచే వస్తోందని గుర్తించారు. ముఖ్యంగా విశాఖపట్నం, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, తిరుపతి వంటి జిల్లాల్లో ఆధునిక పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి.

  1. పరిశ్రమలు & సెక్టార్‌లు: ఫుడ్ ప్రాసెసింగ్, మెరైన్, ఎలక్ట్రానిక్స్, లైఫ్ సైన్సెస్, ఆటోమోటివ్, రోబోటిక్స్, డేటా సెంటర్లు, థీమ్ టూరిజం, నైపుణ్యాభివృద్ధి.
  2. ఐటీ & ఇన్నోవేషన్: విశాఖ, అనంతపురం, తిరుపతిలో ఐటీ పార్కులు, ఇంక్యూబేషన్ సెంటర్లు ఏర్పాటుకు ప్రాధాన్యం.R&D సంస్థలకు ప్రత్యేక రాయితీలు.
  3. మెడికల్ టెక్నాలజీ & బయోటెక్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్​ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం. లైఫ్ సైన్సెస్, APIలు, బయోసిమిలర్స్, క్లినికల్ పరిశోధన కేంద్రాలు స్థాపన.
  4. హై-టెక్ తయారీ పరిశ్రమలు: ఫ్యాబ్ యూనిట్లు, డిస్‌ప్లే ప్యానల్స్, ఎనర్జీ స్టోరేజ్, సోలార్ సెల్స్, టెలికాం పరికరాల ఉత్పత్తి.

Swarnandhra | పెట్టుబడులకున్న అవకాశాలు చూస్తే..

  • 1.వ్యవసాయ-ఆహార ప్రాసెసింగ్: సీఫుడ్ పార్కులు, కోల్డ్‌ చైన్ మౌలిక వసతులు, ప్యాకేజింగ్ టెక్నాలజీ, నాణ్యత పరీక్షా ల్యాబ్స్.
  • 2.ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ: పీసీబీలు, మొబైల్ కంపోనెంట్లు, ఐటీ హార్డ్‌వేర్, బ్యాటరీలు.
  • 3.లాజిస్టిక్స్ & మౌలిక వసతులు: అనంతపురం, విశాఖలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్‌లు. పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, నౌకా రవాణా, తీరప్రాంత అభివృద్ధి.
  • 4.ఏరోస్పేస్ & రక్షణ: బీచ్ సాండ్, హెవీ మినరల్స్ ఆధారిత రక్షణ ఉత్పత్తులు. మెటల్ గ్రేడ్ టైటానియం వంటి అత్యాధునిక పదార్థాల తయారీకి అవకాశం.
  • 5.నీలి ఆర్థిక వ్యవస్థ: సముద్ర సంబంధిత పరిశోధనలు, మౌలిక వసతుల అభివృద్ధి.

ఈ నివేదికలో సూచించిన ప్రణాళికలు అమలైతే, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యుత్తమ టెక్ & పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. అమరావతి చుట్టుపక్కల అభివృద్ధి, విశాఖపట్నం నుంచి అనంతపురం వరకు విస్తరించే పారిశ్రామిక వ్యవస్థ రాష్ట్ర ఆర్థిక వ్యూహాన్ని సమూలంగా మార్చే శక్తిని కలిగి ఉంది.

Must Read
Related News