అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Task force raids : నిజామాబాద్ నగరంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది మెరుపు దాడులు చేసి పలువురిని అరెస్టు చేశారు. నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జి ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో బుధవారం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్సైలు గోవింద్, శివరాం ఈ ఆపరేషన్ చేపట్టారు.
నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల 80 క్వార్టర్స్ లో వ్యభిచార గృహంపై రైడ్ చేశారు. ఇద్దరు ఆర్గనైజర్లు, ఇద్దరు విటులు, ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి తొమ్మిది సెల్ ఫోన్స్, రూ. 93,250 నగదు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఐదో టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు.