59
అక్షరటుడే, ఇందూరు: TPUS Nizamabad | తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (Telangana Regional Teachers Association) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు విభాగ్ ఎన్నికల అధికారి శ్రీనివాస్ జిల్లా ఎన్నికల అధికారి రామకృష్ణారెడ్డి (district election officer Ramakrishna Reddy) తెలిపారు.
జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందూరు జిల్లా అధ్యక్షుడిగా నల్ల కిషన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా డింగరి మధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యుడు, జోనల్ ఇన్ఛార్జి రవీంద్రనాథ్ ఆర్య, కీర్తి సుదర్శన్, ఆర్లగడ్డ రాఘవేందర్, శంకర్, మధుసూదన్, బద్రీనాథ్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.