అక్షరటుడే, ఎల్లారెడ్డి: Panchayat Elections | పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తాండూర్ సర్పంచ్ ఎన్నిక (Tandur Sarpanch election) కౌంటిగ్కు తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగిన ఓట్ల లెక్కింపులో ఇరువురు మధ్య విజయం దోబూచులాడింది. అభ్యర్థులతో పాటు గ్రామస్థుల్లోనూ ఉత్కంఠకు రేకెత్తించింది.
Panchayat Elections | వివరాల్లోకి వెళ్తే..
తాండూర్ సర్పంచ్ పదవికి ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. గ్రామంలో 2,072 ఓట్లు ఉండగా అందులో 1,735 ఓట్లు పోలయ్యాయి. తొమ్మిది పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో (postal ballot votes) కలిసి 1,744 ఓట్లు పోలయ్యాయి. అందులో కమ్మరి సిద్ధరాములుకు 509, భూమా యాదాగౌడ్కు 507 ఓట్లు వచ్చాయి. దీంతో యాదాగౌడ్ ఓట్ల లెక్కింపు రీకౌంటింగ్ చేయాలని అధికారులను కోరారు. ఈ క్రమంలో సిద్ధిరాములుకు వచ్చిన ఓట్లలో మూడు ఓట్లు చెల్లనివిగా గుర్తించి పక్కన పెట్టారు. దీంతో యాదగౌడ్ ఒక ఓటు ఆధిక్యంలోకి వచ్చారు.
Panchayat Elections | మళ్లీ రీకౌంటింగ్ చేయాలని విన్నపం..
ఇప్పుడు సిద్ధిరాములు సైతం రీకౌంటింగ్ చేయాలని అధికారులను కోరారు. ఈ విషయమై డీఎల్పీవో సురేందర్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్తో (Collector Ashish Sangwan) ఫోన్లో మాట్లాడారు. సాయంత్రం 6 నుంచి 11:30 గంటల వరకు అధికారులు సమాలోచనలు చేశారు. చివరకు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒకసారి మాత్రమే రీకౌంటింగ్ ఉంటుందని అభ్యర్థులకు తెలిపారు. దీంతో ఒక్క ఓటుతో భూమా యాదాగౌడ్ విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం అతడికి ధ్రువీకరణ పత్రం అందజేశారు.