అక్షరటుడే, వెబ్డెస్క్: Tandur RTC bus | వికారాబాద్ జిల్లా Vikarabad district లో తాండూరు Tandur డిపో బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది.
యాలాల Yalala మండలంలోని లక్ష్మీనారాయణపూర్ Lakshminarayanpur చౌరస్తా సమీపంలో ఆర్టీసీ బస్సు స్టీరింగ్ ఊడిపోవడంతో ప్రయాణికులు Passengers ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
ఆర్టీసీ అద్దె బస్సు మహబూబ్నగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా దగ్గరకు రాగానే బస్సు స్టీరింగ్ రాడ్ ఊడిపోయింది.
Tandur RTC bus | స్పందించిన డిపో మేనేజర్
స్టీరింగ్ ఊడి, ఆర్టీసీ బస్సు RTC bus నిలిచిపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. కాగా, ఈ ఘటనపై డిపో మేనేజర్ స్పందించారు.
స్టీరింగ్ రాడ్ బోల్ట్ ఊడిపోయిన ఘటన నిజమేనన్నారు. ప్రయాణికులెవరికీ ఏమీ కాలేదన్నారు. వారిని మరో బస్సులో గమ్యస్థానాలకు పంపించామన్నారు.