HomeUncategorizedTamil superstar Vijay | ఏంటి.. విజ‌య్ బాడీ గార్డ్ ఏకంగా అభిమానిపై అలా గ‌న్...

Tamil superstar Vijay | ఏంటి.. విజ‌య్ బాడీ గార్డ్ ఏకంగా అభిమానిపై అలా గ‌న్ పెట్టేశాడు..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thalapathy vijay | త‌మిళ నాట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిలో విజ‌య్ Vijay ఒక‌రు. ఆయ‌న కోలీవుడ్‌లో (kollywood) ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కి (audience) మంచి వినోదం పంచారు. ఇప్పుడు విజ‌య్ రాజ‌కీయాలలోకి (politics) వ‌చ్చారు. త్వ‌ర‌లో సినిమాల‌కి movies కూడా గుడ్ బై చెప్ప‌నున్నారు. అయితే తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి (pawan kalyan) ఎంత క్రేజ్ ఉందో, త‌మిళంలో (tamil) విజ‌య్‌కి అంత క్రేజ్ ఉంది. ఆయ‌న‌ని క‌లిసేందుకు, ఫొటోలు దిగేందుకు అభిమానులు (fans) చాలా ఆస‌క్తి చూపిస్తుంటారు. అయితే తాజాగా ఆయ‌న‌ని క‌లిసేందుకు ఓ అభిమాని ఉరుక్కుంటూ రాగా, విజ‌య్ బాడీగార్డ్ (Vijay bodyguard) ఏకంగా అభిమానిపై గ‌న్ పెట్టాడు.

Tamil superstar Vijay | ఇది ఎంత వ‌ర‌కు క‌రెక్ట్..

తమిళ్ సూపర్‌ స్టార్‌ విజయ్ (Tamil superstar Vijay) మధురై విమానాశ్రయంలో కనిపించారు. దాంతో అభిమానులు (Fans) ఒక్కసారిగా ఆయన్ను కలిసేందుకు, ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. ఒక అభిమాని విజయ్ వైపు వస్తూ ఉండగా బాడీగార్డ్‌ (bodyguard) ఒకరు ఏకంగా పిస్టల్‌ (pistol) తీసి అభిమాని తలకు గురి పెట్టడం హాట్ టాపిక్ అయింది. విజయ్ ఎక్కడకు వెళ్లినా జనాలు పెద్ద ఎత్తున రావ‌డం స‌హ‌జం. సెక్యూరిటీ విష‌యంలో జాగ్ర‌త్తలు తీసుకోవాలి. కాని ఇలా జ‌నాల మీద‌కి గ‌న్ పెట్టి బెదిరించ‌డం స‌రైన ప‌ద్ద‌తి కాదు అని ప‌లువురు త‌మ అభిప్రాయం తెలియ‌జేస్తున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో (public place) ఫేమ‌స్ ప‌ర్స‌న్స్ క‌నిపిస్తే జ‌నాలు రావ‌డం స‌హజం.

కాబ‌ట్టి హీరోలు (heros) ఏం చేయాలి అంటే ఫేస్ క‌వ‌ర్ చేసుకోవాలి. ఇలా క‌నిపిస్తే జ‌నాలు ఎగ‌బ‌డ‌డం కామ‌న్ క‌దా అంటున్నారు. ఏది ఏమైన విజయ్‌ బాడీ గార్డ్‌ (Body Guard) చేసిన పనిపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇక విజ‌య్ ఇప్పుడు జ‌న నాయ‌గ‌న్ (Jana Nayagan) అనే సినిమా చేస్తున్నారు. ఇదే విజ‌య్ చివ‌రి సినిమా (last movie) అంటున్నారు.. ఒక వైపు రాజకీయ నాయకుడిగా బిజీగా ఉంటూనే మరో వైపు కమిట్‌ అయిన సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు విజ‌య్. ఈ సినిమాని విజ‌య్ వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నాడు. మ‌రోవైపు వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో (assembly elections) విజయ్ గెలిచి సీఎం కావాలని అనుకుంటున్నాడు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Must Read
Related News