HomeUncategorizedAllu Arjun | అల్లు అర్జున్- అట్లీ సినిమాలో విల‌న్‌గా త‌మిళ సూప‌ర్ స్టార్.. అంచ‌నాలు...

Allu Arjun | అల్లు అర్జున్- అట్లీ సినిమాలో విల‌న్‌గా త‌మిళ సూప‌ర్ స్టార్.. అంచ‌నాలు పీక్స్‌కి..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించిన పుష్ప 2 చిత్రం సూప‌ర్ హిట్ కావ‌డంతో బ‌న్నీ తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి మామూలుగా లేదు. ఇప్పటికే పాన్ ఇండియా లెవల్లో దర్శకుడు అట్లీ(Director Atlee)తో కలిసి ఓ భారీ విజువల్ మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో స్టార్స్ క్యాస్టింగ్ హై లెవల్ లో ఉండబోతుంద‌నే వార్త‌లు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం బయటకు వచ్చింది. తమిళ మీడియా తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ ప్రాజెక్ట్‌లో విజయ్ సేతుపతి కూడా జాయిన్ కానున్నారని తెలుస్తోంది.

Allu Arjun | విల‌న్‌గా విజ‌య్..

అయితే ఆయన విలన్ పాత్రలోనా, లేక ఇతర కీలక పాత్రలోనా అనే వివరాలు ఇంకా అధికారికంగా బయటకురాలేదు. గతంలో విజయ్ సేతుపతి(Vijay Sethupati) ..అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ సినిమాలో విలన్‌గా నటించి బాలీవుడ్‌లో కూడా బాగా గుర్తింపు పొందారు. అట్లీ – విజయ్ సేతుపతి బాండింగ్ బలంగా ఉండటంతో ఈ కాంబినేషన్ మరోసారి స్క్రీన్‌పై కనపడనుందని అంటున్నారు. ఈ సినిమా కథ హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని టాక్. వారియర్ బ్యాక్‌డ్రాప్‌లో, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను ప్రాసెస్ చేయనున్నట్టు తెలుస్తోంది. దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతున్న ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్‌కు చెందిన టెక్నీషియన్లు కూడా పని చేస్తున్నారు. ఇప్పటికే ముంబైలో వర్క్‌షాప్‌లు కూడా పూర్తి కాగా, నవంబర్ మొదటి వారం నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడిగా దీపికా పదుకోన్ (Deepika Padukone) నటిస్తున్నారు. అలాగే, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ వంటి ప్రముఖ కథానాయికలు కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. తారాగణం, కథా నేపథ్యం, టెక్నికల్ వాల్యూస్ అన్ని భారీ రేంజ్‌లోనే ఉంటాయ‌ని అంటున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీని 2027లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సినిమాకు సంబంధించిన మరిన్ని విష‌యాలు త్వరలోనే వెల్ల‌డించ‌నున్నారు. పుష్ప సిరీస్ తర్వాత అల్లు అర్జున్ నటన మరో లెవెల్‌కు చేరింది. ఇప్పుడు అట్లీ డైరెక్షన్‌లో పాన్ ఇండియా మూవీ అంటే అంచనాలు ఇంక ఏ రేంజ్‌లో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పక్కర్లేదు!