అక్షరటుడే, వెబ్డెస్క్: Tamil Nadu voter list | తమిళనాడు Tamil Nadu లో భారీగా ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) మొదటి విడత పూర్తయ్యాక.. ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 97.37 లక్షల మంది పేర్లు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించిన వివరాల ప్రకారం.. తొలగించిన వాటిల్లో 26.94 లక్షల మరణించిన వారి పేర్లు ఉన్నాయి. 66.44 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు గుర్తించారు. ఇక 3.39 లక్షల పేర్లు ఫేక్ నమోదుగా తేలింది.
Tamil Nadu voter list | డీఎంకే – కాంగ్రెస్ అభ్యంతరం..
ఓటరు జాబితా రివిజన్ చేసే ముందు తమిళనాడులో 6.41 కోట్ల ఓటర్లు ఉండేవారు. పేర్లు తొలగించడంతో ఆ సంఖ్య 5.43 కోట్లకు చేరుకుంది. ఒక్క చెన్నైలోనే 14.25 లక్షల పేర్లు ఉండటం గమనార్హం. కోయంబత్తూరులో 6.5 లక్షల తొలగించిన పేర్లు, కాంచీపురంలో 2.74 లక్షల తొలగించిన పేర్లు ఉన్నాయి.
పేర్ల తొలగింపుపై డీఎంకే–కాంగ్రెస్ కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిని బట్టి ఈ ప్రక్రియ తమకు ఎదురుదెబ్బగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పేర్ల తొలగింపుపై అన్నా డీఎంకే మద్దతు తెలపడ విశేషం. ఇక తొలగించిన జాబితాలో ఉన్నవారు ఓటరుగా నమోదుకు జనవరి 18 వరకు ఈసీ అవకాశం కల్పించింది.