అక్షరటుడే, వెబ్డెస్క్ : Tamilnadu | త్రిభాషా విధానంపై కేంద్రం,తమిళనాడు ప్రభుత్వం మధ్య నెలకొన్న విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Chief Minister MK Stalin)శాసనసభలో హిందీ భాషపై కఠిన నిర్ణయం తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో హిందీ భాష (Hindi Language)ను నిషేధించే లక్ష్యంతో అసెంబ్లీలో ఓ బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.ఈ ప్రతిపాదిత చట్టంపై చర్చించేందుకు నిన్న రాత్రి న్యాయ నిపుణులు, ప్రభుత్వ అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ బిల్లులో రాష్ట్రంలో హిందీ హోర్డింగ్‌లు, బోర్డులు, హిందీ సినిమాలు, హిందీ పాటలను నిషేధించడం వంటి అంశాలు ఉంటాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ చట్టం రాజ్యాంగానికి లోబడే విధంగా రూపొందించబడినట్లు సమాచారం.
Tamilnadu | హిందీ బ్యాన్..
తమిళనాడు (Tamilnadu)లో హిందీ భాషను బలవంతంగా ప్రవేశపెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదని డీఎంకే సహా పలు పార్టీలు నిరంతరం ఆరోపిస్తున్నారు. దీనికి ప్రతిగా రాష్ట్ర శాసనసభ హిందీ భాషని బలవంతం చేయడానికి వ్యతిరేకంగా తీర్మానం తీసుకుంది. ఈ తీర్మానంలో, అధికార భాషలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వానికి (Central Government)సూచించారు. సెప్టెంబర్ 9న రాష్ట్రపతికి సమర్పించిన కమిటీ నివేదికలో, ఈ సిఫారసులు తమిళం సహా ఇతర రాష్ట్రాల భాషలకు, వాటిని మాట్లాడే ప్రజలకు హానికరం అని పేర్కొన్నారు.
ఈ తీర్మానంతోపాటు హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రంలో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఇచ్చిన హామీకి పార్లమెంటరీ కమిటీ సిఫారసులు వ్యతిరేకంగా ఉన్నాయని ఆ తీర్మానంలో పేర్కొనగా. దీన్ని అసెంబ్లీ ఆమోదించడం గమనర్హం. కాగా, రాష్ట్రంలో హిందీయేతర భాషలను పరిరక్షించే ప్రయత్నంలో ముఖ్యమైన దశగా ఇది నిలిచింది. ఈ బిల్లు అసెంబ్లీ ఆమోదించిన తరువాత, తమిళనాడు రాష్ట్రంలో హిందీ భాషపై పరిమితులు విధించబడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. .