HomeUncategorizedTamil Nadu | గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా వద్దు..ఆయ‌న చేతుల మీదుగా తీసుకుంటాన‌న్న‌పీహెచ్‌డీ స్కాల‌ర్

Tamil Nadu | గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా వద్దు..ఆయ‌న చేతుల మీదుగా తీసుకుంటాన‌న్న‌పీహెచ్‌డీ స్కాల‌ర్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tamil Nadu | తిరునెల్వేలిలోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయంలో (MSU) బుధవారం జరిగిన 32వ స్నాతకోత్సవ వేడుకలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్‌ రవి(Tamil Nadu Governor RN Ravi) ముఖ్యఅతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో, డీఎంకే నేత ఎం. రాజన్ భార్య , పీహెచ్‌డీ విద్యార్థిని జీన్ జోసెఫ్ చేసిన ప‌ని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. విద్యార్థులు వరుసగా గవర్నర్ చేతుల మీదుగా డిగ్రీలు అందుకుంటున్న సమయంలో, జీన్ జోసెఫ్ మాత్రం ఆయనను దాటి, పక్కనే ఉన్న వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్(Vice Chancellor Chandrasekhar) చేతుల మీదుగా తన డిగ్రీ పట్టాను స్వీకరించింది.

Tamil Nadu | గ‌వ‌ర్నర్‌కే షాక్..

అనంతరం గవర్నర్‌ వైపు తిరిగి నమస్కరించి ధన్యవాదాలు చెప్పిన ఆమె, గవర్నర్ చేతుల మీదుగా పట్టా తీసుకునేందుకు తిరస్కరించడమే కాకుండా, సున్నితంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు పలువురు భావిస్తున్నారు.తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మరియు డీఎంకే ప్రభుత్వం(DMK Government) మధ్య బిల్లుల ఆమోదం, పాలనా విధానాలపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఈ ఘటనను రాజకీయ కోణంలోనూ చూసే ప్రయత్నాలు సాగుతున్నాయి. జీన్ జోసెఫ్ చర్యకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ పరిణామం నేప‌థ్యంలో గవర్నర్ రవి మాత్రం పూర్తిగా శాంతంగా వ్యవహరించారు. ఆమె చర్యకు స్పందించకుండా ఏమి జ‌ర‌గ‌న‌ట్టు ఉండిపోయారు. ఇక తర్వాత మీడియాతో మాట్లాడిన జీన్ జోసెఫ్ తన నిర్ణయాన్ని స్పష్టంగా సమర్థించుకున్నారు. “గవర్నర్ ఆర్.ఎన్. రవి తమిళ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఆయన చేతుల మీదుగా డిగ్రీ తీసుకోవడం నాకు ఇష్టంలేదు” అని ఆమె స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో (Social Media) వేగంగా వైరల్ అయ్యాయి. ఇప్పటికే గవర్నర్‌ మరియు డీఎంకే ప్రభుత్వం మధ్య విశ్వవిద్యాలయాల నియామకాలతో పాటు పలు విధానాలపై తలెత్తిన విభేదాల నేపథ్యంలో, ఆమె ఈ చర్యను రాజకీయ నిరసనగా చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.