HomeజాతీయంTamil Nadu Stampede | తమిళనాడు​ తొక్కిసలాట ఘటన.. 31కి చేరిన మృతుల సంఖ్య..!

Tamil Nadu Stampede | తమిళనాడు​ తొక్కిసలాట ఘటన.. 31కి చేరిన మృతుల సంఖ్య..!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tamil Nadu Stampede | తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. సినీ నటుడు, టీవీకే (TVK) పార్టీ అధినేత విజయ్ శనివారం రాత్రి నిర్వహించిన భారీ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 31కి చేరుకున్నట్లు స్థానిక పోలీసు అధికారులు ప్రకటించారు.

విజయ్ (Vijay) కొత్తగా తమిళగ వెట్రి కజగం పార్టీ పెట్టిన విషయం తెలిసిందే.​ కాగా, అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని గతంలో ఆయన ప్రకటించారు.

ఈ మేరకు పార్టీ బలోపేతమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కరూర్​ (Karur)లో శనివారం భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విజయ్​  పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలి వచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది.

Tamil Nadu Stampede | భారీగా ప్రజలు తరలి రావడంతో..

ప్రచార ర్యాలీకి భారీగా జనాలు తరలి రావడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పలువురు చిన్నారులు, పార్టీ కార్యకర్తలు ఈ ఘటనలో గాయపడ్డారు.

తొక్కిసలాట ఘటన నేపథ్యంలో విజయ్ తన ప్రసంగాన్ని ఆపేశారు. బాధితులను అంబులెన్స్​ల్లో ఆస్పత్రులకు తరలించారు.

Tamil Nadu Stampede | సీఎం స్టాలిన్​ తక్షణ చర్యలు..

కరూర్​ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్​ (CM Stalin) స్పందించారు. స్థానిక కలెక్టర్​తో మాట్లాడారు. ఘటనా స్థలానికి చేరుకుని వైద్య సాయం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏడీజీపీ (శాంతిభద్రతలు) డేవిడ్సన్ ఘటనా స్థలికి చేరుకున్నారు.

Must Read
Related News