అక్షరటుడే, వెబ్‌డెస్క్: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామనాథపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు.
ఎదురెదురుగా రెండు కార్లు ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దారుణ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన వారంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చెందిన అయ్యప్ప స్వామి భక్తులుగా తమిళనాడు పోలీసులు నిర్ధారించారు.
Tamil Nadu road accident | రామేశ్వం వెళ్తుండగా..
అయ్యప్ప భక్తులు రామేశ్వరం వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ప్రమాద తీవ్రత వల్ల రెండు కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ రెండు కార్లలో ఒకటి ఏపీకి చెందినదిగా గుర్తించారు.
ఈ కారులోనే అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. ఇక మరో కారు ఐరావడి వైపు వెళ్తూ.. కీఝక్కరై సమీపంలో ఏపీ కారును ఢీ కొంది. రెండు కార్లలో 12 మంది ఉన్నట్లు తెలిసింది.
