అక్షరటుడే, వెబ్డెస్క్: Tamil Nadu road accident | తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. Tamil Nadu తిరుచిరాపల్లి జిల్లాలో బుధవారం (డిసెంబరు 24) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. ఆర్టీసీ బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి రెండు కార్లను ఢీ కొంది. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది. ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Tamil Nadu road accident | టైరు పేలిపోవడం వల్లే..
బస్సు ఎదురుగా వచ్చి రెండు వాహనాలను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బస్సు టైరు పేలిపోవడం వల్లే దాని దిశ మారిపోయి, కార్లపైకి దూసుకెళ్లిందన్నారు. తిరుచిరాపల్లి నుంచి చెన్నైకి బస్సు వెళ్తుండగా.. అదుపు తప్పి “చెన్నై నుంచి తిరుచిరాపల్లి వైపు వెళ్తున్న రెండు కార్లను ఢీకొట్టింది. దీంతో కార్లలలో ఉన్న వారిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.