Homeక్రైంTamil Nadu Encounter | విద్యార్థినిపై అత్యాచారం.. నిందితులపై పోలీసుల కాల్పులు​!

Tamil Nadu Encounter | విద్యార్థినిపై అత్యాచారం.. నిందితులపై పోలీసుల కాల్పులు​!

Tamil Nadu Encounter | తమిళనాడులో కామాంధులు బరి తెగించారు. కోయంబత్తూరులోని ఓ కళాశాల విద్యార్థినిని ముగ్గురు కీచకులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, ఈ నిందితులకు తమిళనాడు పోలీసులు తగిన శాస్తి చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu Encounter | తమిళనాడులో కామాంధులు బరి తెగించారు. కోయంబత్తూరులోని ఓ కళాశాల విద్యార్థినిని ముగ్గురు కీచకులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, ఈ కేసులో తమిళనాడు పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ముగ్గురు అత్యాచార నిందితులపై తమిళనాడు పోలీసులు కాల్పులు జరిపారు. వెల్లకినారులోని ఓ ఆలయం వద్ద దాక్కున్న కీచకులపై కాల్పులు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Tamil Nadu Encounter | కాళ్లపై కాల్పులు

అత్యాచార నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో నిందతుల కాళ్లపై కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు వివరణ ఇచ్చారు.

శివగంగకు చెందిన తవసి, కరుప్పస్వామి, కాళేశ్వరన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిపై హత్య, దోపిడీ, దాడితో సహా ఐదు కేసులు ఇప్పటికే నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు.

Tamil Nadu Encounter | అసలేం జరిగిందంటే..

కోయంబత్తూరులో ఓ కాలేజీ విద్యార్థినిని ఆదివారం రాత్రి తన బాయ్​ ఫ్రెండ్​తో కలిసి కారులో బయటకు వచ్చింది. కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతంలో కారు ఆపి అక్కడ మాట్లాడుకుంటున్నారు. కాగా, అదే సమయంలో అక్కడికి వచ్చిన నిందితులు కారును చుట్టుముట్టారు.

బాయ్ ఫ్రెండ్​ను కొట్టి, విద్యార్థిని మరో ప్రాంతానికి లాక్కెళ్లారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం విద్యార్థిని వదిలేసి పారిపోయారు. భయాందోళనకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను గుర్తించి పట్టుకునే క్రమంలో వారు పారిపోతుండగా.. కాల్పులు జరపాల్సి వచ్చిందని చెబుతున్నారు.