HomeసినిమాTamannah Bhatia | హిట్ సెంటిమెంట్‌.. చిరుతో స్పెషల్ సాంగ్‌లో మెరిసేందుకు సిద్ధమైన మిల్కీ బ్యూటీ...

Tamannah Bhatia | హిట్ సెంటిమెంట్‌.. చిరుతో స్పెషల్ సాంగ్‌లో మెరిసేందుకు సిద్ధమైన మిల్కీ బ్యూటీ !

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా క్రేజ్ తెలుగులో కాస్త నెమ్మదించినప్పటికీ, ఇత‌ర భాష‌ల‌లో మాత్రం దూసుకుపోతుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న తమన్నా ఇప్పుడు మరో స్పెష‌ల్ సాంగ్‌లో తెరపై కనిపించేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tamannah Bhatia | టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannah Bhatia) కెరీర్ రెండు దశాబ్దాలు దాటిపోయినా, ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. శ్రీ సినిమాతో తెరంగేట్రం చేసిన తమన్నా, హ్యాపీడేస్‌తో సూప‌ర్ హిట్ ద‌క్కించుకుంది.

ఆ తర్వాత వరుస విజయాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది. స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్‌షేర్ చేసుకున్న‌ ఆమె, ఇప్పటికీ సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తెలుగు సినిమాల్లో (Telugu Movies) హీరోయిన్‌గా కొనసాగుతూనే స్పెషల్ సాంగ్స్‌ ద్వారా కూడా తమన్నా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకుంది. ఒక దశలో “ఐటెం సాంగ్ అంటే తమన్నానే!” అన్నంత పాపులారిటీ సంపాదించింది.

Tamannah Bhatia | క్రేజ్ త‌గ్గ‌లేదు..

అయితే గత కొంతకాలంగా తెలుగు తెరపై ఆమె స్పెషల్ సాంగ్స్‌ (Special Songs) కనిపించకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇప్పుడు ఆ గ్యాప్‌ను పూడ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్’ సినిమా తెరకెక్కిస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.. తమన్నాను (Heroine Tamannah) ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్‌ కోసం ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి గతంలో F2, F3 చిత్రాల్లో తమన్నాతో కలిసి పనిచేశాడు. ఆ సినిమాలు సక్సెస్ కావడంతో ఆమెను “హిట్ సెంటిమెంట్”గా భావిస్తున్నాడట. అందుకే ఈ సారి కూడా చిరుతో రూపొందిస్తున్న‌ సినిమాలో తమన్నా తళుక్కున మెరుస్తే, అది సినిమా బజ్‌కి మరింత ఊపునిస్తుందని భావిస్తున్నాడు.

ఇక భీంస్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన మీసాల పిల్ల సాంగ్‌కి మంచి స్పందన లభించింది. ఇప్పుడు తమన్నా స్పెషల్ సాంగ్‌ వార్తతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. చిరంజీవి, నయనతార, అనిల్ రావిపూడి కాంబినేషన్‌కి తోడు తమన్నా స్పెషల్ సాంగ్​ ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేస్తోంది. ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవికి భారీ హిట్ ద‌క్క‌లేదు. ఇప్పుడు ‘మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు’తో మాత్రం రికార్డులు క్రియేట్ చేయ‌డం ఖాయం అని అంటున్నారు.

Must Read
Related News