అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tamanna Bhatia | మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాది సినిమాలతో (South Indian films) పాటు బాలీవుడ్‌లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది.
అయితే ఆమె వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ప్రేమ జీవితం గురించి కూడా తరచుగా చర్చ జరుగుతూనే ఉంటుంది. కొంతకాలం క్రితం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో (Bollywood actor Vijay Varma) తమన్నా ప్రేమలో ఉందన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇద్దరూ పబ్లిక్ ఈవెంట్లలో కలిసి కనిపించడం, సెలవులు ఎంజాయ్ చేయడం అభిమానుల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఆ రిలేషన్ ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ తరువాత ఇద్దరూ విడిపోయారని వార్తలు వచ్చాయి.
Tamanna Bhatia | ఎవరి గురించి..
బ్రేకప్ తర్వాత కూడా విజయ్‌తో స్నేహం కొనసాగిస్తానని చెప్పిన తమన్నా తాజాగా చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా ఓ చాట్ సెషన్‌లో “నిజాయితీ” గురించి మాట్లాడుతూ తమన్నా ఘాటు వ్యాఖ్యలు చేశారు.“నిజాయితీ అనేది అద్దంలాంటిది. అద్దం పగిలినా దానిని అంటించవచ్చు, కానీ అది ఎప్పుడూ అలాగే ఉండదు. ఎవరైనా హత్య చేసినా క్షమించగలను, కానీ అబద్ధం చెప్పినవారిని మాత్రం తట్టుకోలేను,” అని అన్నారు.తమన్నా ఈ వ్యాఖ్యల్లో ఎక్కడా విజయ్ వర్మ పేరును ప్రస్తావించలేదు కానీ, ఆ మాటల టోన్, టైమింగ్ దృష్ట్యా ఆమె మాజీ ప్రియుడినే ఉద్దేశించిందన్న అర్థం అభిమానులు చేసుకుంటున్నారు.
సినీ వర్గాలు చెబుతున్నట్టుగా తమన్నా ఇటీవలి కాలంలో తన ఆలోచనల్లో, ప్రాధాన్యతల్లో మార్పు తెచ్చుకుందట. కెరీర్, వ్యక్తిగత జీవితానికి మధ్య బ్యాలెన్స్ చేస్తూ, నిజాయితీని ప్రాముఖ్యంగా తీసుకుంటోందని తెలిసింది. కాగా, తమన్నా ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు మాత్రం ఆమె కెరీర్ అంత సజావుగా సాగడం లేదు. వీలున్నప్పుడల్లా హీరోయిన్‌గా నటిస్తూనే అడపాదడపా స్పెషల్ సాంగ్స్‌లో నర్తిస్తూ సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో (Social media) తమన్నా వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమె నిజాయితీ, ధైర్యసాహసాలను ప్రశంసిస్తుండగా, కొందరు మాత్రం “ఇది విజయ్ వర్మకు సూటి వార్నింగ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తమన్నా కొన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది
