More
    Homeజిల్లాలునిజామాబాద్​Talla Rampur | పోలీసుల పహారాలో తాళ్ల రాంపూర్

    Talla Rampur | పోలీసుల పహారాలో తాళ్ల రాంపూర్

    Published on

    అక్షరటుడే, కమ్మర్​పల్లి: Talla Rampur | ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ (Talla Rampur) గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలోని ప్రధాన ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గ్రామంలో వీడీసీ, గౌడ కులస్థులకు మధ్య జరుగుతున్న తగాదాలు తారాస్థాయికి చేరుకోవడంతో సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు పోలీసులు గ్రామంలో పికెట్​ ఏర్పాటు చేశారు. గ్రామంలో 144 సెక్షన్​ విధించారు.

    Talla Rampur | చెట్లు నరికివేయడంతో..

    వీడీసీ ఆగడాలు రోజురోజుకూ హద్దు మీరిపోయి గ్రామంలో అశాంతికి కారణమవుతున్నాయని గౌడ కులస్థులు వాపోతున్నారు. గ్రామంలో గౌడ కులస్థులను గ్రామం నుంచి బహిష్కరించడమే కాకుండా వారికి సంబంధించిన చెట్లను నరికివేయించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిని కవర్​ చేసేందుకు వెళ్లిన ఓ ఛానల్​ విలేకరిపై (Channel Reporter) దాడి చేయడంతో పరిస్థితి మరింత ముదిరింది. దీంతో పోలీసులు గ్రామంలో పికెట్​ ఏర్పాటు చేశారు. సుమారు 1200 మంది పోలీసులు గ్రామంలోని ప్రధాన ప్రాంతాల్లో మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా వేశారు.

    More like this

    Maxivision Eye Hospital | అందుబాటులోకి మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్.. అప్పటి వరకు ఉచిత కన్సల్టెన్సీనే!

    అక్షరటుడే, హైదరాబాద్: Maxivision Eye Hospital | నేత్ర వైద్య రంగంలో ప్రఖ్యాత సంస్థ మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ...

    Job Mela | కామరెడ్డిలో నిరుద్యోగులకు జాబ్​మేళా

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Job Mela | కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) నిరుద్యోగ యువతకు ప్రైవేట్​ రంగంలో ఉద్యోగావకాశాలు...

    Private School | ప్రైవేట్​ పాఠశాలలో దారుణం.. విద్యార్థిని తల పగిలేలా కొట్టిన టీచర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Private School | ఓపికగా ఉండి విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన కొందరు టీచర్లు (Teachers)...