అక్షరటుడే, వెబ్డెస్క్ : Private Colleges | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల (fee reimbursement dues) కోసం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్ పాటిస్తున్న విషయం తెలిసిందే. బకాయిలు చెల్లించే వరకు కాలేజీలు తెరిచేది లేదని యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కాలేజీల ప్రతినిధులతో శుక్రవారం సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) చర్చలు జరిపారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మధ్య ప్రైవేట్ కాలేజీ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ చర్చలు విజయవంతంగా ముగిశాయి. రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.900 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 3 రోజుల్లో రూ.600 కోట్లు విడుదలకు హామీ ఇచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం రూ.600 కోట్ల బకాయిలు విడుదల చేసింది. మరో రూ.300 కోట్లు త్వరలో విడుదల చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. దీంతో రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. సమ్మె కారణంగా వాయిదా పడిన పరీక్షలను త్వరలో తిరిగి షెడ్యూల్ చేస్తారు.
Private Colleges | సీఎం వార్నింగ్
చర్చలకు ముందు సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) మీడియాతో మాట్లాడుతూ విద్యా సంస్థలకు వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొదన్నారు. విద్య అనేది సేవ.. వ్యాపారం చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. సహకరించాల్సిన వారు బంద్ పెట్టారన్నారు. ప్రైవేట్ కాలేజీల (private colleges) ప్రతినిధులు ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారో తనకు తెలుసన్నారు.
వచ్చే ఏడాది నుంచి ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దామన్నారు. విద్యార్థులకు బారంగా మారే విధంగా డొనేషన్లు, ఫీజులు పెంచితే సహించమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్రెడ్డి హెచ్చరికల నేపథ్యంలోనే కాలేజీల ప్రతినిధులు తగ్గినట్లు సమాచారం. 50శాతం బకాయిలు విడుదల చేస్తేనే కాలేజీలు తెరుస్తామని వారు మొదట ప్రకటించారు. తాజాగా రూ.900 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడంతో బంద్ విరమిస్తున్నట్లు తెలిపారు.
