Homeఅంతర్జాతీయంPakistan - Afghanistan war | పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో ఘర్షణలు.. తుపాకుల‌ను పాక్​ సైనికుల ప్యాంట్లకు...

Pakistan – Afghanistan war | పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో ఘర్షణలు.. తుపాకుల‌ను పాక్​ సైనికుల ప్యాంట్లకు త‌గిలించి సంబురాలు

పాక్-ఆఫ్గాన్ సరిహద్దు డ్యూరాండ్ లైన్ సమీపంలోని పాక్ సైనిక పోస్టుల నుండి పాక్ ఆర్మీ వైపు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. వారు పారిపోతున్న‌ సమయంలో తాలిబన్లు పాక్ సైనికుల దగ్గర నుంచి ఆయుధాలను లాక్కున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan – Afghanistan war | డ్యూరాండ్ (Durand) లైన్ సమీపంలో పాక్, అఫ్గాన్ సరిహద్దుల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇటీవల పాకిస్తాన్ ప్రారంభించిన దాడుల్లో తాలిబన్లు తమ ప్రతాపాన్ని చాటుతూ పాక్ సైనికులను త‌రిమికొడుతూ బయటకు పంపించారనే సమాచారం వచ్చింది.

ఈ ఘర్షణలో ఆఫ్ఘాన్ సైనికులు (Afghan Soldiers), తాలిబన్లు ప్రాణాలు కోల్పోయినప్పటికీ, పైచేయి తాలిబన్లదేనంటూ ఆఫ్ఘాన్ జర్నలిస్ట్ దావుద్ జున్‌బిష్ తెలిపారు. తాలిబన్లు పాక్ సైనికులను (Pakistan Soldiers) త‌రిమికొట్ట‌గా, ఆ స‌మ‌యంలో పాక్ సైనికుల దగ్గర ఉన్న ఆయుధాలు, ప్యాంట్లను లాక్కున్నారు. ఈ ప్యాంట్లని వీధుల్లో ఊరేగిస్తూ విజయాన్ని ప్రకటించారు. తమ తుపాకులను పాక్ సైన్యం ప్యాంట్లకు తగిలిస్తూ ప్రజల మ‌ధ్య‌ సంబరాలు చేసుకున్నారు.

Pakistan – Afghanistan war | కాల్పుల విరమణ తర్వాత కూడా ఘర్షణలు

రెండు దేశాలు 48 గంటల కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, సరిహద్దుల్లో రెండు వైపులా దాడులు కొనసాగాయి. పాక్ సైన్యం ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ ఘర్షణల్లో 40 మందికిపైగా అఫ్ఘాన్ తాలిబన్లు హతమయ్యారు. బలోచిస్తాన్ (Balochistan) ప్రాంతంలో సామాన్య‌లుపై కూడా కాల్పులు జరిపారని పాక్ ఆరోపిస్తోంది. పాక్‌ సైన్యం తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ ఘర్షణల్లో నిషేధిత తెహ్రీక్‌-ఎ-తాలిబన్‌ (టీటీపీ) పాకిస్తాన్ ముష్కరుల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అఫ్ఘాన్‌ సైన్యం కూడా తమ పోస్టులను ధ్వంసం చేసి, పాక్ సరిహద్దు వైపుకు దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది.

ఈ ఘర్షణలు కాబూల్‌లోని (Kabul) తెహ్రిక్-ఇ-తాలిబాన్ శిబిరాలపై పాక్ దాడికు సమకాలీనంగా జరిగాయి. ఈ సమయంలో అఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారతదేశాన్ని సందర్శించిన విష‌యం తెలిసిందే. మొత్తానికి పాక్-అఫ్గాన్ సరిహద్దు ప్రాంతంలో దాడులు, ప్ర‌తి దాడులు, తాలిబన్ల సంబరాలు, టీటీపీ పాల్గొనడం వంటి పరిస్థితులు సరిహద్దుల్లో తీవ్ర అస్తవ్యస్తతను సృష్టించాయి. భవిష్యత్తులో పరిస్థితి మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.