అక్షరటుడే, వెబ్డెస్క్: Siddipet | ఎస్జీఎఫ్ క్రీడల్లో కొండపాకలోని టీజీడబ్ల్యూఆర్‌ఎస్(జగదేవ్‌పూర్) కళాశాల (TGWRS (Jagdevpur) College), పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారని ప్రిన్సిపాల్ సవిత తెలిపారు. కొండపాకలోని (Kodapaka) కళాశాల మైదానంలో గురువారం మండలస్థాయి కబడ్డీ(Kabaddi), ఖోఖో(Khokho), వాలీబాల్ పోటీలు(Volleyball competitions) నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు.
Siddipet | వాలీబాల్, ఖోఖో క్రీడల్లో..
వాలీబాల్, ఖోఖో అండర్–17 పోటీల్లో కళాశాల జట్టు ప్రథమ బహుమతి గెలుచుకుందని తెలిపారు. కబడ్డీ అండర్–17లో మొదటి బహుమతి, కబడ్డీ అండర్–14లో ద్వితీయ బహుమతి సాధించినట్లు ఆమె తెలిపారు. కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కొండపాక ఎంఈవో శ్రీనివాస్ (Meo Srinivas) విజేతలకు బహుమతి ప్రదానం చేశారని తెలిపారు.
అనంతరం ఎంఈవో మాట్లాడుతూ.. భవిష్యత్తులో టీజీడబ్ల్యూఆర్‌ఎస్(జగదేవ్‌పూర్) కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో సైతం ప్రతిభ చూపేలా కృషి చేయాలని పేర్కొన్నారు. అద్భుత ప్రతిభ చూపి కళాశాలకు పేరు తేవాలని సూచించారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులను పీడీ శోభారాణి, పీఈటీ లక్ష్మిలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
