అక్షరటుడే, కామారెడ్డి: Raman’s Coaching Center | జిల్లా కేంద్రంలోని రామన్స్ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్న విద్యార్థులు టీజీఆర్జేసీ, పాలిసెట్లో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. టీజీఆర్జేసీలో కామారెడ్డి పట్టణానికి చెందిన పదో తరగతి విద్యార్థిని మాణిక్య లయ రాష్ట్రస్థాయిలో 73వ ర్యాంకు సాధించింది.
అలాగే శనివారం వెలువడ్డ పాలిసెట్ పరీక్ష ఫలితాల్లో లింగం నిర్వేశ్ కుమార్ అనే విద్యార్థి రాష్ట్రస్థాయిలో 210 ర్యాంక్, ముదాం నవితేజ్ అనే విద్యార్థి 225వ ర్యాంక్ సాధించాడు. విద్యార్థిని మాణిక్య లయ రాష్ట్రస్థాయిలో 621 ర్యాంకు సాధించింది. సాయి శివానందన్ రెడ్డి అనే విద్యార్థి 1,007 ర్యాంకును సాధించాడు. రామన్స్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థుల్లో 25మంది 2000లోపు ర్యాంకులను కైవసం చేసుకున్నారు. మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను కోచింగ్ సెంటర్ నిర్వాహకులు శ్రీనివాస్, రాజ్ కుమార్ ఘనంగా సన్మానించారు.